పుట:Endaro Wikimedianlu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావికీపీడియన్

2021లో తెవికీకి లభించిన కృషీవలులలో దివ్య ఒకరు. అనువాద పరికరం ఉపయోగించి విరివిగా వ్యాసాలు రాసారు. వికీ గురించి తెలిసిన తరువాత రాయకుండా ఉండలేని వారు కొందరుంటారు. అనువాద పరికరం గురించి తెలిసిన తరువాత దాన్ని ఉపయోగించకుండా ఉండలేని వారు ఇంకొందరుంటారు. అటువంటి వారిలో దివ్య ఒకరు.

అనువాద పరికరం ద్వారా ప్రచురించిన వ్యాసాల సంఖ్యలో అగ్రస్థానాల్లో ఉన్నవారిలో ఆమెది నాలుగో స్థానం. పరికరం ఇచ్చే యాంత్రికానువాదాల్లో కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి ప్రచురించే జాగ్రత్త తీసుకోవడం ఆమె రచనల్లో ప్రత్యేకత. ఢిల్లీలో జరిగిన వికీ విమెన్స్ క్యాంపులో పాల్గొని, తన వికీ కృషికి గాను అక్కడ ల్యాప్‌టాప్ బహుమానంగా పొందారు. లింగ్వా లిబ్రేలో తెలుగు పదాల ఆడియో ఫైళ్ళు చేసారు. వికీప్రాజెక్టుల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రికెట్ 2023, విశాఖపట్నం, ఫొటోల చేర్పు వంటి ప్రాజెక్టుల్లో గణనీయమైన కృషి చేసారు. వందలాది బొమ్మలను తెవికీ లోకి ఎక్కించారు. వచ్చే పదేళ్ళు వికీని నడిపించే సముదాయంలో దివ్య ఉంటారు.


ఎందరో వికీమీడియన్లు

77