పుట:Endaro Wikimedianlu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికీ కిరణం


వికీలోకి వస్తూనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. వారిలో నేతి సాయికిరణ్ ఒకరు. స్వయంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో తన కెరీర్‌ను నిర్మించుకున్న వ్యక్తి కావడం చేత, నీటిలో చేపలాగా తెవికీలో ఒదిగిపోయాడతను. వ్యాసాలు రాయడమే కాకుండా వికీప్రాజెక్టులలో ఎంతో కృషి చేసాడు. 2021 లో నిర్వహించిన ఫొటోలు చేర్చే ప్రాజెక్టులో కృషిచేసి, 7,500 పేజీల్లో బొమ్మలు చేర్చి తెవికీలోకెల్లా అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు, 2022 లో తాను స్వయంగా ఆ వికీప్రాజెక్టు చేపట్టి విజయవంతంగా నిర్వహించాడు.

వికీమీడియా మూవ్‌మెంటు పనుల్లో చురుగ్గా ఉంటూ మెటా స్థాయిలో కూడా కృషి చేస్తూ ఉంటాడు. ఇతర స్వచ్ఛంద తెలుగు ప్రాజెక్టుల గురించి తెవికీలో చెబుతూ ఇక్కడి వారికి అవగాహన కలిపిస్తూ ఆ ప్రాజెక్టులకు ఊపునిస్తూ ఉంటాడు. లింగ్వా లిబ్రే అనే ప్రాజెక్టు గురించి తెవికీలో చెప్పి కొందరు వికీమీడియన్ల దృష్టిని అటువైపు మళ్ళించాడు. దాంతో ఆ ప్రాజెక్టులో ఏ ప్రగతీ లేకుండా నేలబారుగా ఉన్న తెలుగు విభాగం ఒక్కసారిగా స్ట్రాటోస్ఫియరు లోకి దూసుకుపోయింది.

అంతేకాదు, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న కొన్ని భాషలలో విజ్ఞాన భాండాగారం తయారు చేసేందుకు కూడా సాయికిరణ్ కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగం గానే గోండి, కొలామి భాషల వికీపీడియాలను స్థాపించాలనే ప్రయత్నంలో ఉన్నారు.


ఎందరో వికీమీడియన్లు

75