పుట:Endaro Wikimedianlu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెవికీసోర్సు రాయంచ

స్ఫుటమైన వ్యక్తిత్వం, కచ్చితమైన అభిప్రాయాలు, లక్ష్యాలు ఉన్నవారు గుంటుపల్లి రామేశం గారు. అలాంటి లక్ష్యాల్లో కొన్ని - మరుగున పడుతున్న ప్రాచీనాంధ్ర సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నది ఒకటి. ఆ లక్ష్యమే ఆయనకు తెలుగు వికీసోర్సులో విస్తృతంగా పనిచేసేందుకు ఇంధనం.

తెలుగు వికీసోర్సు ఒక గ్రంథాలయం. కాపీహక్కుల పరిధిలో లేనివీ, ఎవరినీ అనుమతి అడగక్కరలేకుండా ఎవరైనా పంచుకోదగ్గవీ అయితే చాలు ఏ తెలుగు పుస్తకమైనా అప్‌లోడ్ చేసి, టైప్ చేసి అందుబాటులోకి తేవచ్చు. అయితే, రామేశం గారు అలా ఏ పుస్తకం మీదైనా పనిచేసేసే వ్యక్తి కాదు. ఆయన పుస్తకాన్ని ఎంచుకున్నారంటే దానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండాల్సిందే.

ఉదాహరణకు కట్టా వరదరాజ కవి రచించిన ద్విపద రామాయణాన్ని ఆయన తెవికీసోర్సులో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారు. అసలు ఏమిటీ ఈ పుస్తకం అని చూస్తే - వాల్మీకి రామాయణ మూలాన్ని దగ్గరగా అనుసరిస్తూ రచించిన మొట్టమొదటి తెలుగు ద్విపద రామాయణం ఇది. కృష్ణదేవరాయల తదుపరి కాలానికి చెందినవారు ఆ కట్టా వరదరాజ కవి. ఆ రచన తర్వాతి కాలంలో విస్మృతిలో పడిపోయి ఒకే ఒక్క తాళపత్రం ఎక్కడో తంజావూరు సరస్వతీ మహల్లో ఉంటే నిడుదవోలు వెంకటరావు గారు 1950ల్లో పరిష్కరించి, ప్రచురించి తిరిగి వెలుగులోకి తెచ్చారు. అదిగో - అలాంటి అరుదైన, విలువైన రచనను ఎంపికచేసుకుని తెలుగు వికీసోర్సు ద్వారా టైపుచేసి, దిద్ది ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చినవారు మన రామేశం గారు.

ఎందరో వికీమీడియన్లు

67