పుట:Endaro Wikimedianlu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆతడనేక వికీ కార్యక్రమముల…

ఆతడనేక వికీ కార్యక్రమముల నారియుతేరిన వికీమూర్తి. వికీ బయట కార్యక్రమాలు నిర్వహించిన తెవికీపీడియన్లలో రహ్మానుద్దీన్ ముందు వరుసలో ఉంటారు. ఒకప్పుడు సిఐఎస్‌లో పనిచేస్తూ వికీపీడియాతో కలిసి పలు ఔట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించారు. పుస్తక ప్రదర్శనల్లో తెవికీ స్టాళ్ళు నిర్వహించారు. తెవికీ ఉత్సవాల నిర్వహణలో పాలుపంచుకున్నారు.

తెలుగు ప్రాంతాల్లో తెవికీ కాడి భుజాన వేసుకుని విస్తారంగా తిరిగిన కొద్దిమందిలో రహ్మానుద్దీన్ ఒకరు. బరంపురం నుంచి బళ్ళారి దాకా, తంజావూరు ఆవల నుంచి ఆదిలాబాదు పైపైవరకూ ఎన్నెన్నిచోట్లకి వెళ్ళి ఎందరు తెలుగు రచయితలను, సంస్థలను కలిశారో ఆయనకే తెలియాలి. సహజంగానే తెలుగు పట్ల తనకున్న అనురక్తి, తెలుగులో విజ్ఞానమూ, రచనలూ పెరగాలన్న ఉద్యమంతో మమేకమూ ఉండడంతో తెవికీతో పాటు భాషోద్యమంలోని ఇతర ప్రయత్నాల్లో తనకు భాగం ఉంది. తెలుగులో పిల్లలు చదువుకోదగ్గ సైన్స్ పుస్తకాలు రాయడం నుంచి పుస్తక మహోత్సవాల నిర్వహణా సహకారం వరకూ రకరకాల కార్యకలాపాలు చేపట్టినవారు.

తెవికీలో వికీపీడియా ఏషియన్ నెల వంటి పలు వికీప్రాజెక్టులను నిర్వహించారు. తెవికీతో పాటు, వికీడేటా, వికీసోర్సు, కామన్సుల్లో కూడా చురుగ్గా ఉండేవారు. 2021 నుండి తెవికీలో అంతగా చురుగ్గా లేరు.

ఎందరో వికీమీడియన్లు

47