పుట:Doddi Komurayya -2016.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రపంచ చరిత్రలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, చైనా వంటి విప్లవాలతో పాటు మొదటి, రెండవ ప్రపంచయుద్దాలు భీకరంగ జరిగినయి. అదేవిధంగ భారతదేశంలో కూడ స్వాతంత్ర్యం కోసం ఎన్నో తిరుగుబాట్లు జరిగినయి. ఇట్లాంటి అనేక ఉద్యమాలు పోరాటాలే, ప్రపంచచరిత్ర గతిని మార్చి స్వేచ్భా పతాకాన్ని ఎగరేసినయి. ఆ పోరాట క్రమంలో రగిలిన ఒకానొక జ్వాలే కడివెండి కన్నబిడ్డ దొడ్డి కొమురయ్య. విసునూరు దేశముఖ్‌ గూండాల దౌర్జన్యానికి అగ్రహోదగ్రుడై విష్లవసింహంలా ముండుకురికి మహావిప్లవాన్ని సృష్టించిన ఆ వీరుని చరిత్రను పుస్తకంగ తీసుకురావాలని అనుకున్న అందుకోసం వీరభూమి, పోరాటాల పాటిగడ్డ కడివెండి మట్టికి దండంపెట్టి రావాలని కొందరు మిత్రులతో పాటు కలిసి కడ్‌వెండికి చేరుకున్న. కడివెండిలో అడుగుపెట్టిన మరుక్షణమే మనసు రణరంగంలో నిలబడ్డట్టయ్యింది. దొడ్డి కొమురయ్య స్తూపాన్ని చూసినంతనే పొరాట దృశ్యాలు ఒక్కటొక్కటి కండ్లముందు కదలాడి రక్తం ఉప్పొంగినట్టయ్యింది.

ముందుగ కడివెండి సర్బంచ్‌ ఇంటికి పొయినం. ఏదోవిధంగ దొడ్డి మల్లయ్య చిన్న కొడుకు బిక్షపతి నెంబరు తీసుకొని ఫోన్‌చేసినం. బిక్షపతిని వెంటబెట్టుకొని దొడ్డి కొమురయ్య జ్ఞాపకాలను నెమరు వేసుకుంటు దొడ్డి కొమురయ్యకు సంబంధించిన సమాచారం కోసం గ్రామంలో పెద్దవాళ్ళందరిని కలిసినం. వాళ్ళలో మందడి మోహన్‌రెడ్డి, దరగాని సోమయ్య, బాషపాక ఉప్పలయ్య, బైరు అయిలయ్యలు విలువైన సమాచారం ఇచ్చిండ్రు. దరగాని సోమయ్య 90 సంవత్సరాల పెద్దమనిషి గట్టిగ నంషూర్మ ఆరోగ్యంతోని ఉన్నడు. దొడ్డి కొమురయ్య మీద కాల్పులు జరిగిన నంవుటనకు సంబంధించిన విషయాలు ఆయనకు బాగ గుర్తున్నట్టు, చెప్పిండు. ముఖ్యంగ దొడ్డి కొమురయ్యకు సంబంధించి ఆతి విలువైన విషయం ఏం జెప్పిండంటే దొడ్డి కొమురయ్య అంబటి వెంకన్న * 9