పుట:Doddi Komurayya -2016.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రజల ద్వారా ప్రజలకు తెలుస్తున్న చరిత్ర

- డా! బెల్లి యాదయ్య

చరిత్ర ఎవరు రాసినా రాసిన ప్రతి రచయిత ఏదో ఒక నూతన విషయం చెప్ప గలుగుతడు. ఎందుకంటె చరిత్ర ఒడువని ముచ్చట, విడువని ఆలింగనం, తీరొక్క గోస. తెలంగాణకు సంబంధించి ఉద్యమ సందర్భంలో సభలు, సమావేశాల్లో మౌఖిక చరిత్ర చాలా చర్చకు వచ్చేది. ఒకరిద్దరు లిఖిత చరిత్రను కూడ అందించిండ్రు. రాష్ట్ర అవతరణ తర్వాత సర్వీస్‌ కమీషన్‌ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల అవసరాల రిత్యా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ చరిత్రను అనేక మంది అనేక పేర్లతో గ్రంథాలను వెలువరిస్తుండ్రు. ఈ క్రమంలోనే కవి, గాయకుడు శ్రీ అంబటి వెంకన్న జాబిలి కళామండలి, నల్లగొండ ద్వార దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని స్మరిస్తు ఈ పుస్తకాన్ని తెస్తున్నడు. ఇందుకు వెంకన్న అభినందనీయుడు.

వాజ్ఞయంలో కవిత్వం, కథ, నవల, నాటకం వంటి ఊహాత్మక కల్చనాసహిత రసాన్విత రచన కాదు చరిత్ర. పక్కా ఆధారాలు, సాక్ష్యాలున్న యదార్థ ఘటనలే చరిత్ర. తెలంగాణలో సూపుతి అంటరు. గా సూపుతి లెక్కలు, పత్రాలు ఉన్నదే చరిత్ర. ఇతివృత్తం రిత్యా చెప్పాలనుకుంటె ప్రజానుభవమే ఒక కాలంలో, ఒక స్థలంలో జరిగిన సంఘటనలే చరిత్ర. దీన్ని రాయడానికి లైసన్స్‌ ఎవరి దగ్గర ఎవరు పొందాల్సిన పనిలేదు. చరిత్ర రచయిత ప్రధానంగ తాను ఏదైతే రాస్తున్నాడో ఆ ఘటనలకు, ఘట్టాలకు సంబంధించిన పరిసరాల్లో కనీసం తిరగాలి. వ్యక్తులను, సంస్థలను కలవాలి. తిరగకుండ, వ్యక్తులను, సంస్థలను పలకరించకుండ కేవలం గతంలో వచ్చిన పుస్తకాలేవో ముందేసుకొని తాను చెప్పదలుచుకున్న దానికి అనుకూలమైన ఉటంకింపులను ఎత్తిరాసే పేజీలు చరిత్ర ఎప్పటికి కాదు. అది చరిత్ర తాలూకు అగాథాలను ఎంతమాత్రం పూడ్చలేదు. పూడ్చకపోగ కొత్తపేచీలు, తగాదాలకు దారితీసే కొట్లాటల పుస్తకం అవుతది.

అట్లా కాకుండ ఈ పుస్తకం రాయడానికి అంబటి వెంకన్న కడివెండి, పాలకుర్తి విసునూరు ప్రాంతాలను సందర్శించిండు. ఎరుకున్న పెద్దమనుషుల్ని కలిసిండు. విషయాలను తెలుసుకున్నడు. సేకరించిన సమాచారంతో ఆయా పుస్తకాల్లో చెప్పబడిన సంగతులను బేరీజు వేసుకుండు. తన భావనలో తేలిన కోణాలను చెప్పిండు. అక్కడక్కడ ప్రాంతేతర కమ్యూనిస్టుల మీద ఆగ్రహం వెలిబుచ్చిండు. దొడ్డి కొమురయ్య వీర మరణం రగిల్చిన సాయుధ రైతాంగ పోరాట ఆరణికి సంబంధించిన


అంబటి వెంకన్న * 5