పుట:DivyaDesaPrakasika.djvu/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


28. కపి స్థలమ్‌ 28

శ్లో|| శ్రీ మద్గజేంద్ర సరసీ కపిలాఖ్య తీర్థ | సంశోభితే శుభ కపిస్థల దివ్యదేశే |
    దేవ్యా రమామణిలతాహ్వయయా సమేతో | దేవో గజేంద్ర వరదో భుజగేంద్ర శాయీ |

శ్లో|| వైమానమస్య వర కారక నామధేయం | దేవేశ దిగ్వదన సంస్థతి శోభమానః |
    నాగాధిరాజ మరుదాత్మజ సేవితాజ్గః | శ్రీ భక్తిసారమునిరాజ నుతో విభాతి |

వివ: గజేంద్ర వరదన్ - రమామణి వల్లి తాయార్ - పాఱ్తా మరైయాళ్ - గజేంద్ర పుష్కరిణి - కపిల తీర్థము - గగనాకార విమానము - తూర్పుముఖము - భుజంగ శయనము - గరుత్మంతునకు, హనుమంతునకు ప్రత్యక్షము. తిరుమழிశై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ దివ్య దేశమునకు 5 కి.మీ. దూరములో ఉమయాపురమునకు పోవు మార్గములో తొండరడిప్పొడి ఆళ్వార్ల తిరూవతార స్థలమైన మణ్డజ్గుడి క్షేత్రము కలదు.

మార్గము: కుంభఘోణం - పాపనాశం టౌను బస్. పాపనాశం నుండి 3 కి.మీ. కుంభఘోణం - తిరువయ్యారు బస్ మార్గమున 20 కి.మీ. సత్రములు కలవు.

పా|| కూత్తముమ్‌ శారా కొడువినైయుమ్‌ శారా; తీ
     మాత్తముమ్‌ శారా వగై అణిన్దేన్ - ఆற்றజ్
     కరై కిడక్కుమ్‌ కణ్ణన్ కడల్ కిడక్కుమ్‌
     మాయన్ ఉరైక్కిడక్కుం ఉళ్ళత్తెనక్కు.
           తిరుమழிశై ఆళ్వార్ - నాన్ముగన్ తిరువన్దాది 50 పా.


సంబంధము

మంచిమాట

మిళకాళ్వాన్ అను ఆచార్యులు తామున్న గ్రామమునకు ప్రక్కనగల వేరొక గ్రామమునకు తరచుగా పోవుచుండెడివారు. ఇది తెలిసిన కొందరు భక్తులు వారిని జూచి మీరు ప్రక్కగ్రామమునకు పలుమార్లు పోవుచున్నారేల? అని ప్రశ్నించిరి. అందులకు మిళకాళ్వాన్ ఇట్లు సమాధానము చెప్పిరి.

"చూడుడు". నేను ఆయూరు వెళ్ళినచో ఆయూరివారికి భగవంతుని విషయములను చెప్పుచుందును. ఆ మంచి మాటలు వినుటచే ఆయూరివారు ఈయూరి వారికి విరోధులు కాకుండ నుందురు. మరియు నేను చెప్పిన భగవత్సంబంధమైన మాటలు విని సంతసించి వారు సమర్పించిన పదార్థములను తీసికొని వచ్చి భాగవత కైంకర్యము చేయుదును. ఇందువలన పదార్థములను సమర్పించిన వారికిని మంచి కలుగును.

ఆమాటలు వినిన భక్తులు వారి పదార్థములు మనకు అనుకూలించునా? అని ప్రశ్నింపగా మిళగాళ్వాన్ నేను అందరిని శ్రీమన్నారాయణునితో సంబంధము గల వారిగానే చూతును. కాని యెవరిని ప్రకృతి సంబంధులుగా చూడను. కావున నాకు ఏ వస్తువయినా శ్రీమన్నారాయణునకు సంబంధించినది గానే కనిపించును అని చెప్పిరి.

కావున అందరిని, అన్నింటిని, శ్రీమన్నారాయణునితో సంబంధము కలవారిగానే దర్శింపవలెను

"వార్తామాల"

                       39