23. తిరుచ్చిత్తరకూడమ్ 23 (చిదంబరం)
శ్లో|| శ్రీ పుండరీక సరసీ పరిశోభమానే
శ్రీ చిత్రమూట నగరే భుజగేంద్ర శాయీ
శ్రీ పుండరీక లతికా ప్రియ దివ్యరూపః
శ్రీ సాత్త్వికాఖ్య వరమన్దిరవాస లోలః
శ్లో|| ప్రాచీముఖ శ్శివముఖా మర కణ్వ తిల్యా
ప్రత్యక్ష మంగళ తనుః కులశేఖరేణ
సంకీర్తితః కలిజితా మునినా చ నిత్యం
గోవిందరాజ భగవానవనౌ విభాతి
వివ: గోవింద రాజస్వామి - పుండరీకవల్లి తాయార్ - సాత్త్విక విమానం - పుండరీక సరస్సు - తూర్పుముఖము - భుజంగభోగశయనము - పరమశివునకు, దేవతలకు, కణ్వమహర్షికి, తిల్యకు ప్రత్యక్షము. కులశేఖరాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.
విశే: ఈ క్షేత్రమునకు పడమట దిశగా 40 కి.మీ. దూరమున స్వయం వ్యక్త స్థలములలో నొకటియైన శ్రీముష్ణమును, నైరుతి దిశగా 25 కి.మీ. దూరమున కాట్టుమన్నార్ కోవెలయు గలదు. ఈ సన్నిధిలోనే చిదంబర నటరాజ శివాలయము గలదు.
మార్గము: మద్రాసు - తిరుచ్చి రైలు మార్గములో కలదు. తమిళనాడులోని అన్ని ముఖ్యపట్టణముల నుండి బస్ వసతి కలదు. అన్ని సౌకర్యములు గల నగరము.
పా|| అజ్గణెడు మదిళ్ పుడైశూழ అయోత్తి యెన్నుమ్
అణినగరత్తులగనైత్తుమ్ విళక్కుఇనోది
వెజ్గదిరోన్ కులత్తు క్కోర్ విలక్కాయ్ తోన్ఱి
విణ్ ముழுదు ముయ్యక్కొణ్డ వీరన్ఱన్నై
శెజ్గణెడుమ్ కరుముగిలై యిరామన్ఱన్నై
త్తిలై నగర్ తిరుచ్చిత్తర కూడన్దన్నుళ్
ఎజ్గళ్ తని ముదల్వనై యెమ్బెరుమాన్‌న్ఱన్నై
యెన్ఱుకొలో కణ్‌కుళిర క్కాణునాళే
కులశేఖరాళ్వార్ - పెరుమాళ్ తిరుమొழி 5-10-1
34