పుట:DivyaDesaPrakasika.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశే: ఈ సన్నిధిలో శివాలయము, బ్రహ్మకు ఆలయమును కలవు. సన్నిధిలో పురాతనమైన అరటి చెట్లు కలవు.

శ్రీరంగమునకు ఉత్తరమున 2 కి.మీ.దూరమున గలదు. శ్రీరంగము నుండి తిరుచ్చి నుండి బస్ సౌకర్యము గలవు. శ్రీ రంగము నందుండియే సేవింప వలెను.

   పేరానై కుఱుబ్గుడి యెమ్బెరుమానై ; తిరుత్తణ్గా
   లూరానై క్కరమ్బనూరుత్తమనై ; ముత్తిలజ్గు
   కారార్ తిణ్ కడలేழுమ్‌ మలై యేழிవ్వులగే ழுణ్డుమ్‌
   ఆరాదెన్ఱిరున్దానై క్కణ్డదు తెన్నరజ్గత్తే
         తిరుమంగై ఆళ్వార్ పె.తి.మొ. 5-6-2

6. తిరువెళ్ళఱై (శ్వేతగిరి)

శ్లో. తీర్దై: పుష్కల పద్మ చక్ర కుశకై స్సంశోభ మానస్థితే
   రమ్యే శ్రీ మణి కర్ణి కాహ్వాయ వరాహఖ్యాత తీర్దాఞచ్‌తే |
   గంధ క్షీరసు దివ్య పుష్కరిణికా యుక్తే సితాద్ర్యాహ్వయే
   రాజంతం నగరేతు వెళ్లర పదే ప్రాగస్య సంస్థానగమ్‌ ||

శ్లో. శ్రీ మచ్చంపక వల్లికా పరిగతం శ్రీ పంగయచ్చెల్వికా
   నాయక్యా విమలాకృతిం సురుచిరం వైమాన వర్యశ్రితమ్‌ |
   మార్కండేయ శిబిక్షితీశ గరుడ క్షోణీ దృశాం గోచార
   పద్మాక్షాహ్వయ మాశ్రయే కలిరిపు శ్రీ విష్ణు చిత్త స్తుతమ్‌ ||

వివ: పుండరీకాక్షులు-పంగయచ్చెల్వి తాయార్-(చంపకవల్లి) పుష్కల, పద్మ, చక్ర, కుశ, మణి కర్ణిక, వరాహ, గంద, క్షీర, పుష్కరణులు-శ్వేతాద్రి-విమలాకృతి విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-మార్కండేయ, శిబి, గరుడ, భూదేవులకు ప్రత్యక్షము-పెరియాళ్వారులు, తిరుమంగై ఆళ్వారులు కీర్తించినది.

విశేషములు: ఈ క్షేత్రమునకు శ్వేతగిరి యనిపేరు. శిబి చక్రవర్తి ప్రార్ధనచే స్వామి ప్రయోగచక్రముతో పుండరీకాక్షు లనుపేర సేవ సాయించిరి. ఇచట స్వామికి ఇరువైపుల సూర్య చంద్రులు వింజామరలు వీచుచుందురు. మరియు ఇచ్చట ఉత్తరాయణ-దక్షిణాయన ద్వారములు గలవు. ఉయ్యక్కొండార్ (పుండరీకాక్షులు) అవతార స్థలము. మీన మాసమున బ్రహ్మోత్సవం.

మార్గము: శ్రీరంగము నుండి ఉత్తమర్ కోయిల్ మీదుగా తిరుచ్చి-ఉరయూర్ బస్ మార్గములో శ్రీరంగమున నుండి 15 కి.మీ దూరమున గలదు. బస్ దిగిన పిమ్మట 1/2 కి.మీ దూరంలో సన్నిధి కలదు. ఏ వసతులు లేవు. శ్రీరంగము నుండి సేవించాలి.