తిరువాయిమొழி పిళ్లై
(శ్రీ శైలనాథులు)
తిరునక్షత్ర తనియన్:-
శ్రీశైలేశగురుం లోకదేశికాంఘ్రి సమాశ్రితమ్
వృషే విశాఖా సంభూతం వన్దే పరగుణాకరమ్||
నిత్య తనియన్:-
సమశ్రీశైలనాథాయ కున్తీనగర జన్మనే|
ప్రసాదలబ్ద పరమప్రాప్య కైంకర్యశాలినే||
వీరు విభవనామ సంవత్సరం వైశాఖ మాసం విశాఖానక్షత్రమున పాండ్యదేశమునందలి కున్తీ నగరమునందవతరించిరి. వీరికి తిరుమలై ఆళ్వార్ అనియు తిరువాయిమొழிపిళ్లై అనియు తిరునామములు. వీరు పిళ్లైలోకాచార్యులుగారిని ఆశ్రయించి పంచసంస్కారములను పొందిరి. వారిసన్నిధిలోనే దివ్య ప్రబందముల నధ్యయనము చేసిరి.
దేవాదివులని నామాంతరముగల నాలూరాచ్చాంబిళ్లై గారి సన్నిధిలో భగవద్విషయమును, శ్రీబాష్యాది గ్రంథములను అழగియమణవాళప్పెరుమాళ్ నాయనార్ సన్నిధిలోను, తత్త్వత్రయ ఆచార్యహృదయాదులను కూరకులోత్తమ దాసర్ వద్దను, మిగిలిన గ్రంథములను విళాంశోలై పిళ్లైగారి సన్నిధిలోను అధ్యయనము చేసిరి. వీరు నమ్మాళ్వార్ల యందు అమితమైన ప్రావణ్యముగల వారగుటచే ఆళ్వార్ తిరునగరి జీర్ణోద్దరణ గావించిరి. రామానుజ చతుర్వేది మంగలమను అగ్రహారము నేర్పరచి దాని మధ్య ఉడయవరుల సన్నిధి నిర్మించి దాని నిర్వహణము పెరియజీయర్‌కు అప్పగించిరి. వీరి శిష్యులలో మణవాళమామునులు ప్రధానులు. వీరు పెరియాళ్వార్ తిరుమొழிకి స్వాపదేశఉరై అనుగ్రహించిరి.
తిరునక్షత్రము: వృషభం-విశాఖానక్షత్రం
ఆచార్యులు: పిళ్లై లోకాచార్యులవారు
శిష్యులు: శ్రీమణవాళమామునులు మొదలగువారు
గ్రంథములు: పెరియాళ్వార్ తిరుమొழிకి స్వాపదేశఉరై
వాழி తిరునామమ్
వైయగమెణ్ శడగోపర్ మరైవళర్తోన్ వాழிయే
వైగాశి విశాగత్తిల్ వన్దుదిత్తాన్ వాழிయే
ఐయన్ అరుళ్‌మారికలై అయ్‌న్దురైప్పోన్ వాழிయే
అழగారుమెతిరాశర్ అడిపణివోన్ వాழிయే
తుయ్యవులగారియ న్‌దన్ తుణైప్పదత్తోన్ వాழிయే
తొల్‌కురుకాపురి యదనై త్తులక్కినాన్ వాழிయే
తెయ్‌వనగర్ కున్తిదన్నిల్ శిఱక్కవన్దోన్ వాழிయే
తిరువాయిమొழி పిళ్లై తిరువడిగళ్ వాழிయే.
232