పుట:DivyaDesaPrakasika.djvu/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుర కవియాళ్వార్

తిరునక్షత్రతనియన్:-
   మేషే చిత్తా సముద్భూతం పాండ్య దేశే గణాంశకమ్‌
   శ్రీపరాంకుశ సద్బక్తం మధురం కవి మాశ్రయే||
   హస్త స్థ తాళద్వితయం ప్రపద్యే శఠారి వా గ్వ్యాసముదారకీర్తమ్|
   మాధుర్య సంశ్లిష్ట కవిత్వయుక్తం మహత్వ సమ్బావిత బుద్దితత్త్వమ్‌||
నిత్యతనియన్:-
   అవిదిత విషయాంతర శఠారే:
   ఉపవిషదాముపగానమాత్మభోగ:
   అపిచగుణవశాత్తదైక శేషీ
   మధురకవి: హృదయే మమావిరస్తు.

వీరు పాండ్య దేశమందలి తిరుక్కోళూరు అను దివ్య దేశమున కుముద గణేశాంశమున వకుళభూషణ భాస్కరోదయమునకు ముందు(నమ్మాళ్వార్ల అవతారమునకు) అరుణోదయమువలె మేషమాసమున చిత్తా నక్షత్రమునందవతరించిరి.

వీరు ఉత్తర దివ్యదేశయాత్ర చేయుచు ఒకనాడు అయోధ్యలో వేంచేసియుండగా నాటిరాత్రి దక్షిణ దిశనుండి అప్రాకృత దివ్యతేజ:పుంజమును చూచి ఆశ్చర్యచకితులై రాత్రి భాగమునందు దాని ననుసరించుచు పోయి క్రమముగా ఆళ్వార్ తిరునగరి చేరిరి. అచట తింత్రిణి మూలమున పద్మాసనోపవిసిష్ఠులై వేంచేసియున్న నమ్మాళ్వార్లను సేవించిరి.

వారు ముకుళితనేత్రులై యుండుటచే వారి శ్రవణేంద్రియ పాటవమును పరికింప నొకరాతినియెత్తి పడవైచిరి. ఆశబ్దమునువిని ఆళ్వార్లు కనులు విప్పి జాడగా "ప్రకృతి సంబంధముగల జీవుడు దేనిని తి యెచట పడియుండు" నని ప్రశ్నింపగా ఆళ్వార్లు "దానినే తిని యచటనే పడియుండునని" సమాధానమిచ్చిరి.

ఆ సమాధానము వినిన మదురకవులు ఆళ్వార్ల జ్ఞాన విశేషమునకాశ్చర్యపడి వారిని ఆచార్యులుగా వరించిరి. ఆళ్వార్లును వీరినభిమానించి తామనుగ్రహించిన దివ్య ప్రబంధమును వీరికినుపదేశించిరి. మధురకవులును తమయాచార్యుల యందలి ప్రావణ్యముచే "కణ్ణిమణ్ శిరుత్తాంబు" అనుదివ్య ప్రబంధము ననుగ్రహించిరి.

189