Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. తిరునారాయణపురమ్‌ (మేల్‌కోట్టై)

శ్లో. కల్యాణీ సరసా పరాశర దనుష్కోట్యాఖ్య వై కుంఠకై:
   తీర్థె: యాదవ లోకపావన ముఖై: పుణ్యై స్సదా శోభితే
   శ్రీమద్యాదన భూదరేంద్ర శిఖరే నారాయణాఖ్యే పురే
   శ్రీనారాయణ నామకో విజయతే సంపత్కుమారో హరి:||

   యదుగిరి పదపూర్వాం నాయకీ మీక్ష మాణ:
   స్థితియుగృ భుదిగా స్యో వంత వైమాన మాప్త:|
   మణిమకుట నిమిత్తం పక్షిరాజాక్షి సేవ్యో
   యతిపతి కరుణాత్తో రక్షితో రాజరాజ:||

వివ: తిరునారాయణన్-ఉత్సవరులకు శెల్వప్పిళ్లై, సంపత్కుమారన్, శ్రీరామప్రియర్ అను తిరునామములు కలవు. తాయార్ యదుగిరి నాచ్చియార్ పెరుమాళ్ల శ్రీపాదములలో భూదేవి వేంచేసి యున్నారు.

కల్యాణి, వైకుంఠ, పరాశర, మైత్రేయ, ధనుష్కోటి, యాదవ, లోకపావన పాండవ తీర్థములు. తూర్పుముఖ మండలము; నిలచున్నసేవ; వేదపుష్కరిణి, శ్రీరామతీర్థము, నారాయణ తీర్థము, గరుత్మంతునకు వైరముడి నిమిత్తము ప్రత్యక్షము. ప్రతినిత్యము అనుసంధానముచేయు శ్రీరంగాది క్షేత్రములలో తిరునారాయణపురము నాల్గవది. ఈక్షేత్రమునకు జ్ఞానమండపమనిపేరు.

విశే: కృతయుగమున సనత్కుమారులు సత్యలోకమునుండి ఆనందమయ విమానముతో తీసికొనివచ్చి ఇచ్చట శ్రీమన్నారాయణుని ప్రతిష్ఠించుటచే నీక్షేత్రమునకు నారాయణాద్రియని పేరు. త్రేతాయుగమున దత్తాత్రేయుడు నల్గురు వేదపురుషులతో వేద పుష్కరిణి సమీపమున సదా వేదాద్యయనము చేయుటచే వేదాద్రియనియు, ద్వాపరయుగమున నమ్బిమూత్తపిరాన్ అనువారు; యదు శేఖరుడైన శ్రీకృష్ణభగవానుడు ఆరాదించుటచే యాదవాద్రి యనియు; కలియుగమున యతి శేఖరులైన భగవద్రామానుజులు వేంచేసి జీర్ణోద్దారణ చేయుటచే "యతిశైల" మనియు పేరువచ్చెను. దక్షిణ బదరికాశ్రమమనియు తిరునామము కలదు.

భగవద్రామానుజులు చోళోపద్రవకాలమున ఈక్షేత్రమునకు వేంచేసి ఈ ప్రాంతమును పాలించుచున్న రాజును కటాక్షించి వానికి విష్ణువర్థనుడని దాస్యనామముంచిరి. మరియు భూమియందు నిక్షిప్తమై యున్న ఈ క్షేత్రమును స్వామి ఆజ్ఞ ప్రకారము పునరుద్ధరణగావించిరి. ఇచట వేంచేసియున్న ఉత్సవమూర్తి ఆనాడు డిల్లీ పాదుషా అంత:పురము నందుండుటచే భగవద్రామానుజులు డిల్లీచేరి పాదుషాచే

                                        146