పౌరాణిక క్షేత్రములు
శ్లో. అథ పౌరాణికై ర్గీతా దివ్యదేశా శ్రియ:ఎతే:|యద్వద్రి పూర్వా వర్ణ్యంతే యతీశ్వర కటాక్షత:|
1. బృన్దావనమ్
శ్లో. శ్రీ వత్సాప హరాఖ్య తీర్థ రుచిరే బృందావనాఖ్యే పురే
రాధా వల్లభ నాయకో విజయతే రాధా రమా సంయుత:|
రాధాయా నయన ద్వయా తిథి వపు: ప్రాగాస్య సంస్థానగో
దివ్యై ర్మంగళ చేష్టితై ర్గుణ గణై రామోద ముత్పాదయన్||
వివ: రాధా వల్లభ పెరుమాళ్; రాధాదేవి; వత్సాపహార తీర్థము; యమునా నది; తూర్పు తిరిముఖ మండలము; నిన్ఱతిరుక్కోలము;రాధాదేవికి ప్రత్యక్షము. ఈ సన్నిధి కాళీయ మర్దన ఘట్టమునకు సమీపమున గలదు.
విశే: శ్రీకృష్ణ భగవానుడు యాదవ ప్రముఖులతో నివసించిన ప్రదేశము బృందావనము. ఇచట ప్రధానముగా సేవింపదగినవి యమునానదీ తీరమున గల ముప్పది రెండు స్నానఘట్టములు; కాళీయమడుగు; కదంబ వృక్షము; వస్త్రాపహార ఘట్టము అతిసుందరముగా మలచబడిన క్షీరఘాట్; కేశఘాట్; బిలవవనము(లక్ష్మీనిలయం) రాధా నివాసమైన మధువనము.
ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్థనం రంగాచార్య స్వామి వారిచే నిర్మింపబడిన శ్రీరంగమందిరము కలదు. ఇది శ్రీరంగమువలె సప్త ప్రాకారములతో దాక్షిణాత్య సంప్రదాయమున పాంచరాత్రగ మోక్త ప్రకారముగా నిర్వహింపబడు చున్నధి. ఇచట సేవార్థులకు సర్వసౌకర్యములు కలవు. సన్నిధిలో ప్రసాదము లభించును.
ఈక్షేత్రస్వామి విషయమై శ్రీవేదాంత దేశికులు గోపాలవింశతిని అనుగ్రహించిరి.
పా. పట్టిమేయ్‌న్దోర్ కారేఱు; పలదేవఱ్కోర్ క్కీழ்కన్ఱాయ్;
ఇట్టీరిట్టు విళైయాడు; యిజ్గేపోదక్కణ్డీరే?|;
ఇట్టమాన పశుక్కళై; యినిదుమఱిత్తు నీరూట్టి;
విట్టుక్కొణ్డు విళైయాడు విరున్దావనత్తే కణ్డోమే.
పా. మాదవ నెన్ మణియినై వలైయిల్ పిழைత్త పన్ఱిపోల్
ఏదుమొన్ఱుం కొళత్తారా వీశన్ఱన్నై క్కణ్డీరే!
పీదగవాడై యుడై తాழ ప్పెరుజ్గూర్ మేగక్కన్ఱేపోల్
వీదియార వరువానై విరున్దావనత్తే కణ్డోమే!!.
ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 14-1,5
143