పుట:DivyaDesaPrakasika.djvu/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108. పరమపదమ్‌ (తిరునాడు) 13

శ్లో. శ్రీ వైకుంఠే పరమ పదమిత్యార్య సందోహగీతే
   మాయాతీతే త్రిగుణ రహితే శుద్ధ సత్త్వ స్వరూపే|
   నిత్త్యైర్ముకైర్లపతి విరజా దివ్య వద్యా స్తమేతే
   ప్రాప్తేచైరం మద పదసరో వేదమౌళి ప్రసిద్దే||
   లక్ష్మీ నీళా వనిముఖ శతైర్దిన్య పత్నీ సమూహై
   ర్నిత్యం సేవ్య: పరమపదరా డ్వామ దేవాపరాఖ్య:|
   యామ్యాఖ్యాశా వదన యుగ సంతాఖ్య వైమాన శోభే
   దివ్యె: కీర్త్య స్వగుణ విభవ స్సూరిభి ర్భాతి నిత్యమ్‌||
   దివ్యాస్థానే మణిమయ మహాస్తంభ సాహస్ర రమ్యే
   శేషే దివ్యే దశశత ఫణా మండలాకాండ శోభే|
   శ్రీ మద్రామానుజమునిజర ప్రోక్త సిద్దాన్త తత్త్వ
   ప్రేమోద్ఘుష్ట స్వ విషయ జగత్కారణ త్వాది ధర్మ:||

వివ: పరమ పదనాథన్-పెరియ పిరాట్టి-మాయాతీతము-శుద్ద సత్త్వమయ దేశము-నిత్యముక్త సంసేవ్యము-విరజానది-ఐరం మద సరస్సు-శ్రీ భూ నీళాది దివ్యపత్నీ సమేతము-పరవాసుదేవ తిరునామము-దక్షిణ ముఖము-అనంత విమానము-కూర్చున్నసేవ-మణిమయ సహస్ర స్తంభ శోభిత తిరుమామణి మంటపము-భగవద్రామానుజ సిద్దాంతమున ప్రేమాతిశయము గలమూర్తి-జగత్కారణత్వాది ధర్మములు గలవాడు. ఆళ్వార్లు కీర్తించిన మూర్తి. భగవదనుగ్రహమున మోక్షము నందిన వారలకు మాత్రమే ప్రాప్యుడు.

పా. విణ్ కడన్ద శోదియాయ్ విళజ్గు జ్ఞానమూర్తియాయ్
   పణ్ కడన్ద తేశమేవు పాపనాశనాదనే
   ఎణ్ కడన్ద యోగినోడు ఇరున్దు శెన్ఱు మాణియాయ్
   మణ్ కడన్ద వణ్ణ నిన్నై యార్ మదిక్కవల్లరే||
           తిరుమழிశై ఆళ్వార్లు-తిరుచ్చన్ద విరుత్తమ్‌ 27

పా. శూழ் విశుమ్బణి మగిల్ తూరియ ముழక్కిన
   ఆழ் కడలలై తిరై క్కైయెడుతాడిన
   ఏழ் పొழிలుమ్‌ వళమేన్దియ వెన్నెప్పన్
   వాழ் పుగழ் నారణన్ తమరైక్కణ్డుగన్దే.
           నమ్మాళ్వారు-తిరువాయిమొழி 10-9-1

                                    142