పుట:DivyaDesaPrakasika.djvu/237

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


105. శ్రీ ద్వారక 10

శ్లో. శ్రీ గోమతీ పుణ్య సరస్తటస్థే శ్రీ ద్వారకాఖ్య నగరే విరాజన్
   కల్యాణ నారాయణ నామధేయ:కళ్యాణదేవ్యా పరిభూషితాజ్గ:||
   దివ్యాష్ట మహిషీ నాథో ద్రౌపదీ దృష్టి గోచర:
   హేమకూట విమానస్థ: పశ్చిమాభి ముఖానస:|
   పరాంకుశ కలిధ్వంసి గోదావిష్ణు మనస్తుత:||

వివ: కల్యాణ నారాయణన్-కల్యాణదేవి-గోమతీదేవి-అష్టమహిషలు-హేమకూట విమానము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-ద్రౌపతికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్-తిరుమంగై ఆళ్వార్-ఆండాళ్-పెరియాళ్వార్ కీర్తించినది.

విశే: ఇయ్యది ముక్తి ప్రద క్షేత్రములలో నొకటి. సన్నిధికి సమీపముననే గోమతీ నది సముద్రములో కలియుచున్నది. అక్కడ నుండి బస్సుమార్గమున పోయి బేటి ద్వారక చేరవలెను. ఇది శ్రీకృష్ణుని నివాస స్థలము. ఇచట 1500 గృహములు కలవు. ఇచట మాలవరులు శంఖ చక్రధారియై వేంచేసియున్నారు. దీనికి 5 కి.మీ. దూరమున శంఖతీర్థము కలదు. ఇచట పెరుమాళ్ళ వక్షస్థలమున పిరాట్టి వేంచేసియున్నారు. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. అనేక సన్నిధులు కలవు. ప్రతిదినము తిరుమంజనము జరుగును. పసిపిల్లవానివలె-రాజువలె-వైదికోత్తమునివలె అలంకారములు జరుగును.

ద్వారక నుండి ఓఘ పోవుమార్గములో 5 కి.మీ. దూరమున రుక్మిణీదేవి సన్నిధి గలదు. ఇదియే రుక్మిణీ కల్యాణము జరిగిన ప్రదేశము. ద్వారక సమీపమున తోతాద్రి మఠము కలదు. విరావన్‌స్టేషన్‌లో దిగి 160 కి.మీ. దూరమునగల రైవతక పర్వతమును చేరవచ్చును. ఇచట అనేక సన్నిధులు గలవు. కృష్ణావతారమునకు ముందుగానే సేవసాయించిన ప్రదేశము. శయనతిరుక్కోలము.

మార్గము:బొంబాయి-ఓగా రైలుమార్గములో ఓగారేవు ముఖద్వారానికి 35 కి.మీ. దూరము. అహమ్మదాబాద్ నుండి బస్‌లు గలవు. అన్నివసతులు కలవు.

పా. కూట్టిలిరున్దు కిళియెప్పోదుమ్‌ కోవిన్దా! కోవిన్దా! ఎన్నழைక్కుమ్‌
   ఊట్టక్కొడాదు శెఱుప్పనాగిల్ ఉలగళన్దాన్! ఎన్ఱు ఉయరక్కూవుమ్;
   నాట్టిల్ తలైప్పழிయెయ్‌ది యుజ్గళ్ నన్మైయిழన్దు తழయిడాదే
   శూట్టుయర్ మాడజ్గళ్ శూழ்న్దు తోన్ఱుమ్‌ తువరావదిక్కెన్నైయుయ్ త్తిడుమిన్.
            ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 0-12-9

                  139