103. తిరుప్పిరిది (నన్దప్రయాగ) (జోషిమఠ్) 8
శ్లో. పరిమళ లతికాఖ్యాం నాయకీం వీక్షమాణ
పరమ పురుషనామా భోగి భోగే శయాన:|
కలిరిపు మునికీర్త్య: పార్వతీగోచరాంగో
హిమవతి గిరిరాజే రాజతే ప్రాజ్ముఖాఖ్య:||
గోవర్దనేంద్ర తీర్థాడ్యే తిరుప్పిరిది పట్టణే|
మానసాఖ్య సరస్తీరే గోవర్ధన విమానగ:||
వివ: పరమ పురుషన్-పరిమళ వల్లి-గోవర్ధన-ఇంద్ర తీర్థములు. మానస సరస్సు-గోవర్ధన విమానము-తూర్పు ముఖము-భుజంగ శయనము-హిమవత్పర్వతము-పార్వతీదేవికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: జోషీమఠ్‌నే తిరుప్పిరిది యందురు. ఈ క్షేత్రము దేవప్రయాగ నుండి 170 కి.మీ. దూరములో నున్నది. మధ్యలో గల నందప్రయాగలో విష్ణుగంగ మందాకినీ నదులు కలయు చున్నవి. అచట నందగోపులు, యశోద కణ్ణన్ సన్నిధులు గలవు.
కుబేరుడు తపమాచరించిన ప్రదేశమే తిరుప్పిరిది. ఇచట ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడినట్లుగా ప్రసిద్దమైన నృసింహస్వామి సన్నిధి కలదు. వాసుదేవుల సన్నిధి కలదు. వాసుదేవులు నిన్న తిరుక్కోలములో వేంచేసియున్నారు. వీరి ఆళ్వార్లు కీర్తించినట్లుగా కొందరు చెప్పుదురు.
ఈ జోషిమఠ్ సమీపముననే విష్ణు ప్రయాగ కలదు. అచట నారదునిచే ప్రతిష్ఠింపబడిన సన్నిధి కలదు. దీనికి సమీపముననే పాండుకేశ్వరం గలదు. బదరీ సన్నిధి మూసియుంచు నపుడు ఉత్సవమూర్తులను ఈ పాండికేశ్వరములోని వాసుదేవుల సన్నిధిలో నుంచి తిరువారాధన చేతురు. ఈ పాండికేశ్వరమునకు 25 కి.మీ. దూరమున బదరికాశ్రమము గలదు.
మార్గము: దేవప్రయాగ నుండి 170 కి.మీ.
పా. వాలి మాపలత్తొరుపనదుడల్; కెడవరి శిలై వళై విత్తన్ఱు;
ఏలనాఱు తణ్డడమ్ పొழிలిడమ్బెఱ; విరున్ద నల్లిమయత్తుళ్
ఆలిమా ముగిలదిర్ దరవరువరై: యగడుఱ ముగడేఱి;
పీలిమామయిల్ నడ--యుమ్; తడ--వై ప్పిరిది శెన్ఱడైనె--
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 1-2-1
The
137