101. బదరికాశ్రమం (బదరినాధ్) - 6
శ్లో. శ్రీ తప్త కుండ తీర్థాడ్యే బదర్యాశ్రమ పట్టణే|
అరవింద లతానాధో నారాయణ సమాహ్వయ:||
తప్తకాంచన వైమానే సురనాథ దిశాముఖ:|
పద్మాసన జ్ఞాన ముద్రా లంకృతో జపశీలవాన్||
మంత్రోపదేశం కృతవాన్ పరాఖ్యస్య మునే:పురా|
రథాంశ యోగి కలిజిత్ స్తుతో విజయతే తరామ్ ||
వివ: బదరీ నారాయణుడు-అరవిందవల్లి-తప్తకుండ తీర్థము-తప్తకాంచన విమానము-తూర్పుముఖము-పద్మాసనము-జ్ఞానముద్ర-నరునకు మంత్రోపదేశము చేసిన స్థలము-పెరియాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: స్వయం వ్యక్తక్షేత్రము. తిరు అష్టాక్షరీ మంత్రము అవతరించిన స్థలము. విశాలపురి యనియు తిరునామము గలదు. ఇచట స్వామి అగ్నితప్త కుండముగా వేంచేసియున్నారు. ముందుగా నారద కుండములో స్నానముచేసి పిమ్మట అగ్నికుండములో స్నానమాచరించవలెను. ఇచట పెరుమాళ్లు మాత్రమే దృవమూర్తిగా వేంచేసియున్నారు. మిగతావారు ఉత్సవమూర్తులు. ఈస్వామి ఎదుట తెరవేయరు. తిరుమంజనాదులన్నియు బహిరంగముగనే జరుగును. మంచు పడుట వలన తులమాసం పౌర్ణమినాడు(వెణ్ణకాప్పు) వెన్న సమర్పించి తలుపులు వేయుదురు. తిరిగి మేష మాసం పౌర్ణమినాడు తలుపులు తీయుదురు. సన్నిధికి వెనుకగల లక్ష్మీనృసింహ మందిరమున ఉడయవర్ వేదాంత దేశికులు మొదలగువారు వేంచేసియున్నారు. ఈ క్షేత్రమున మన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారిచే నిర్మింపబడిన సన్నిధి గలదు. ఇచటకు 1 కి.మీ దూరములో బ్రహ్మకపాలము గలదు. ఇచటకు 8 కి.మీ. దూరమున గల వసుదార కలదు. ఇందు జలము పుణ్యులైన వారిమీదనే పడునని ప్రతీతి.
మార్గము: హరిద్వార్(కలకత్తా-డెహ్రాడూన్ మార్గం)నుండి హృషికేశ్ చేరి అట నుండి 300 కి.మీ. బస్‌లో ప్రయాణించి బదరీచేరవలెను.
పా. సణ్డుకామరానవాఱుమ్; పావైయర్ వాయముదమ్
ఉణ్డవారుమ్, వాழ்న్ద వాఱమొక్క పురైత్తిరుమి,
తణ్డుకాలావూన్ఱి యూన్ఱి; త్తళ్ళి నడవామున్;
వణ్డుపాడుమ్ తణ్డుழாయాన్ పదరివణజ్గుదుమే.
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 1-3-5
135