Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమలలో అధ్యయన ఉత్సవమ్‌

తిరుమలైలో అద్యయనోత్సవములు ఇయఱ్పాతో ప్రారంభమై 23 దినములు నాలాయిరం సేవతో పూర్తి అవుతాయి. ఆపైన ఒక్కరోజు వరాహప్పెరుమాళ్ సన్నిధిలో అధ్యయనోత్సవం జరుగును. అద్యయనోత్సవ శాత్తుముఱై రోజున తిరుమామణి మణ్డపంలో తిరువాయిమొழி శాత్తుముఱై పూర్తి అయి తీర్థ ప్రసాద గోష్ఠి అవడంతోనే భగవద్రామానుజులు సన్నిధికి ప్రదక్షిణంగా తిరువేంగడముడైయాన్ సన్నిధికి వేంచేసి పెరుమాళ్ల యెదుట "వెన్ఱుమాలై యిట్టాన్" మండపంలో ఉండగా జీయంగార్లు, ఆచార్యపురుషులు తిరుప్పల్లాండులో ని రెండు పాశురములను "ఒழிవిల్ కాలమెల్లాం, ఉలగముణ్డ పెరువాయా, తాయే తన్దైయెన్ఱుమ్‌. అనేపాశురాలను "అఖిల భువన జన్మ స్థేమ" ఇత్యాది శ్లోకాన్ని శరణాగతి గద్యంలోని పూర్వ ఖండాన్ని అనుసందానం చేస్తారు. అంతట భగవద్రామానుజులకు శ్రీనివాసుని పుష్పమాలా శఠగోపాదులతో మర్యాదలు జరుగును. ఆపైన తిరిగి పై పాశురములను అనుసందింతురు. ఇట్లు మంగళాశాసన కార్యక్రమం పూర్తికాగానే భగవద్రామానుజులు సన్నిధికి ప్రదక్షిణంగా తమ సన్నిధికి వేంచేయుదురు.

"చివరి రోజున తణ్ణీరముదువళి తిరుత్తుణై" అను ఉత్సవం జరుగును. ఆరోజు భగవద్రామానుజులు పాపవినాశం వేంచేసి తీర్థ తీసికొనిరాగా ఆతీర్థంతో పెరుమాళ్లకు తిరుమంజనం జరుగుతుంది. ఇది పెరియ తిరుమలనంబిగారి కైంకర్యానికి స్మారకము.

ఆపైన తిరుపతిలో గోవిందరాజ స్వామిసన్నిధిలో అధ్యయనోత్సవములు జరుగును. చివర రోజున నమ్మాళ్వార్లకు పరమ పదోత్సవం జరుపబడుతుంది. ఈ అధ్యయనోత్సవములు పూర్తి అయిన తరువాతనే తిరుమల తిరుపతులలోని సన్నిధులలోను, ఆచార్య పురుషుల తిరుమాళిగలలోను దివ్యప్రబంధాను సన్థానం ప్రారంభమగును.

తిరుమల తిరుపతులలోని క్షేత్రములు

దిగువతిరుపతిలో గోవిందరాజస్వామి సన్నిధి, చక్రవర్తి తిరుమగన్(శ్రీరాములవారి) సన్నిధి ప్రముఖముగా తప్పక సేవింపవలసినవి. ఈ సన్నిధులలో గల ఆళ్వారాచార్యుల సన్నిధులును తప్పక సేవింపవలెను. ఈమధ్యే తిరుమల తిరుపతి దేవస్థానముల దర్మాధికారులైన (శిరియకేళ్వి) శ్రీమత్ప్రరమహంస పరివ్రాజకాచార్యేత్యాది శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి నిర్మించిన సన్నిధియు, యాత్రికులకు అవశ్యము దర్శనీయమై యున్నది. ఈసన్నిధిలో వేంచేసియున్న శ్రీసుదర్శన నారసింహమూర్తి భక్తుల పాలిట కల్పవృక్షము.

                                             125