తిరుపతికి వేంచేసి మలై అడివారంలో కొంతకాలం ఆరాధింపబడినారట.
అట్లె శ్రీరంగము నుండి నంబెరుమాళ్ళు (శ్రీరంగనాథులు) దెవెరులతో తిరుమలైకు వేంచేసి ద్వజస్తంభమున కెదురుగనుండు రంగమండపమున కొంతకాలం భక్తులకు సేవసాయించినారట. ఆ కారణంగానే "కజ్గులుమ్ పగలుమ్" అను శ్రీరంగనాథుని గూర్చి యుండు దశకము(తిరువాయిమొழி 7-2) ఇక్కడ అనుసంధింపబడు చున్నది.
ఈ సన్నిధిలో స్నపన బేరముగా నున్న "అழగప్పిరానార్" అనుమూర్తియే శయ్యా బేరముగను సేవలనందుకొనుచున్నారు. కాని దనుర్మాసం నెలరోజులు మాత్రం శ్రీవైఖానసాగమం ప్రకారం శ్రీకృష్ణమూర్తియే శయ్యా బేరముగ శయన సేవను అనుగ్రహించు చుండును.
ఈసన్నిధిలో శ్రీరామచన్ద్రుడు సీతా లక్ష్ముణులతో సేవ సాయించుచున్నారు. ఇందుకు కారణమేమనగా;
దక్షిణ మధురకు సమీపమునగల "కురువిత్తురై" అను గ్రామమునకు "విశ్వంభరుడు" అనుమహర్షికి సాక్షాత్కరించినట్టి అభయప్రద శ్రీరామచంద్రుని(విభీషణునకు అభయమిచ్చిన శ్రీరామచంద్రుని) ఆలయం ఉండేది. ఆ ఆలయంలో రామలక్ష్మణుల విగ్రహములు మాత్రము ఉండేవి. కొన్ని ఉపద్రవముల వలన ఆ విగ్రహములను అచటి భక్తులు తిరుపతికి తీసికొనిపోయి భగవద్రామానుజులకు నివేదించినారట. ఆసమయంలో శ్రీమద్రామాయణమున అభయప్రదాన ఘట్టం కాలక్షేపం జరుగుచుండినందు వలన ఆస్వామియే స్వయముగా వేంచేసినాడని తలచి రామానుజులు సీతాదేవి యొక్క అర్చామూర్తిని కూడ వారి ప్రక్కనే ప్రతిష్ఠింపజేసి తిరుక్కల్యాణ మహోత్సవం జరిపించి తిరుమలై లోని తిరువేంగడముడై యాన్ సన్నిధిలో వేంచేసింప చేసినారు. ఆ మూర్తులను నేడు మనం సేవింపవచ్చును. తప్పక సేవించాలి.
ఇట్లే తిరుపతిలోని గోవిందరాజ స్వామి సన్నిధిలో "ఆండాళ్" అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసినారు. గోవిందరాజస్వామి వారి ఉత్తరమాడ వీధిలో ఒక అగ్రహారాన్ని నిర్మించారు. దీనికి "శ్రీరామానుజపురం" అనిపేరు. తమ ప్రతినిధిగా సన్నిధికై కైంకర్యములు పర్యవేక్షించుటకు "సేనాపతిజీయర్" అనువారికి హనుమన్ముద్రిక నిచ్చి నియమించినారు. ఆముద్రికతోనే నేటికిని రాత్రిభాగమున సన్నిధి తాళములకు సీలు చేయబడుచున్నది.
ఇట్లే "తిరుక్కురువై" అనే గ్రామంలో "కురువైనంబి" అనుకుమ్మరి శ్రీవేజ్కటాచలపతిని అనన్య భక్తితో సేవించుచుండెడివాడు. అతడు పరమపదించు
123