Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొందినారు. తెళ్ళి అழకియసింగర్ (నరసింహస్వామి)-పశ్చిమ ముఖము-కూర్చున్నసేవ-జాబాలికి అత్రిమహర్షికి ప్రత్యక్షము.

చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులు) సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నులు దక్షిణముఖము-శశపదుని కుమారుడగు మధుమానునకు ప్రత్యక్షము.

తేవప్పెరుమాళ్ (గజేంద్రవరదన్)-తూర్పుముఖము-గరుడా రూడులు-శేష విమానము-ఇంద్ర అగ్ని సోమ మీన-విష్ణుతీర్థములు. వీనిచే చుట్టబడిన కై రవిణీ సరస్సు. ఆకై రవిణీ తీరమున పార్థసారధి రంగనాథ నరసింహ శ్రీరామచంద్ర గజేంద్రవరదులుగా వేంచేసియున్నారు. మార్కండేయ, అత్రి, సుమతి, మరీచి, భృగు, జాబాలి, సర్పరోములకు ప్రత్యక్షము. పేయాళ్వార్-తిరుమழிశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది. ఈ తిరువల్లిక్కేణిలో స్వామి పంచమూర్తులుగా వేంచేసియున్నారు.

విశే: తమిళములో కలువపువ్వును "అల్లి" అందురు. కలువపూవులు మెండు గాగల పుష్కరిణి యగుటచే "తిరు అల్లిక్కేణి" అని ప్రసిద్ది చెందినది. ఈ క్షేత్రము మైలాపూరునకు సమీపమునందుండుటచే మయిలై తిరువల్లిక్కేణి యనియు తిరునామము గలదు. బృందారణ్యక్షేత్రమనియు పేరు కలదు. తొండమాన్ చక్రవర్తి ప్రార్థనచే తిరుమలై తిరువేంగడముడైయాన్ (శ్రీనివాసుడు) కృష్ణావతారముగా సకుటుంబముగా సేవ సేయించిన ప్రదేశము. కావున స్వామి వేంకటేశ్వరుని తిరునామముతో "వేంకటకృష్ణన్" అను తిరునామమేర్పడినది. ఈ దివ్యదేశమున స్వామి రుక్మిణీదేవితోను, బలరాముడు సాత్యకి (సోదరులు) ప్రద్యుమ్నుడు (కుమారుడు) అనిరుద్దుడు (మనుమడు) వీరితో కలసి సకుటుంబముగా సేవ సాయించును. ఇట్టి సన్నివేశమును మరియొకచోట దర్శింపలేము. అట్లే శ్రీరంగనాథులు(శయనించిన) చక్రవర్తి తిరుమగన్(నిలచున్న) గజేంద్రవరదన్ (పయనించుచున్న) అழగియశింగర్ (కూర్చున్న) విధము సేవింపదగినది. (ఒకే దివ్యదేశమున నిన్ఱ, ఇరున్ద, కిడన్ద, నడన్ద తిరుక్కోలములు).

ఇచటనే ఆసూరి కేశవాచార్యులవారు పుత్రకామేష్ఠి చేసి "భగవద్రామానుజులను" పుత్రులుగా పొందిరి.

మార్గము: మద్రాసులోని తిరువల్లిక్కేణి.

పా. విఱ్పెరు విழవుమ్‌ క-నుమ్‌ మల్లుమ్;వేழముమ్‌ పాగనుమ్‌ వీழ;
   శెత్తవన్ న్ఱన్నై పురమెరిశెయ్‌ద; శివనుఱుతుయర్ కళై తేవై;
   పత్‌తలర్ వీయక్కోల్ కైయిల్ కొణ్డు; పార్తన్ఱన్ తేర్‌మున్ నిన్ఱానై
   శిత్‌తవై పణియాల్ ముడితుఱన్దానై; త్తిరివల్లిక్కేణి క్కణ్డేనే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-3-1

                                           114