పుట:DivyaDesaPrakasika.djvu/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

93. తిరుక్కడల్ మల్లె 20

(మహాబలిపురం)

శ్లో. శ్రీ మత్తార్ష్య తరజ్గిణీ తటగతే దేశేకడల్ మల్ల ఇ
   త్యాఖ్యే శ్రీ నిలమంగ నామయుతయాదేవ్యా భుజజ్గేశయ:
   భాతి శ్రీ స్థలశాయి నామకవిభు శ్శ్రీ పుండరీకేక్షిత:
   ప్రాగాస్యస్తు ఘనాకృతా కలిరిపు శ్రీ భూతచక్రస్తుత:||

వివ: స్థలశయనర్-నిలమంగై నాచ్చియ్యర్-తార్ష్య నది-తూర్పు ముఖము-భుజంగశయనము-గగనాకార విమానము- పుణ్డరీకునకు ప్రత్యక్షము-పూదత్తాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

ఇది పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనము చేసిన సన్నిధి శిధిలమై సముద్రతీరమున కలదు. ఇది శిధిలముకాగా కొంత దూరములో మరియొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవ సాయించు క్షేత్రము ఇదియొక్కటియే.

పుండరీకమహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చింపబోయెనట. ఆసమయమున స్వామి ఒక వృద్ద బ్రాహ్మణుని రూపముతో వచ్చి ఆకలిగానున్నది, ఆహారమునీయుమని అడిగెను. అంతట పుండరీకుడు ఆహారమును తీసికొని వచ్చుటకు వెడలెను. ఇంతలో స్వామి ఆ తామరపుష్పములను అలంకరించుకొని పుండరీకమహర్షి తలచిన రూపముతో శయనించెను. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ అని సంబోధించిరి.

ఈక్షేత్రమునగల జ్ఞానపిరాన్(వరాహస్వామి) సన్నిధి తప్పక సేవింపవలెను. ఇచటస్వామి తిరుమేనిలో తాయార్లు కుడివైపున ఉండుటచే ఈసన్నిధికి వలనెన్దై అనిపేరు.

ఇది అతిమనోహరమైన శిల్పసంపదతో అలరారు క్షేత్రము. తిరుమంగై ఆళ్వారు ఈక్షేత్రస్వామిని కీర్తించుచుండ తిన్ఱనూర్ భక్తవత్సలస్వామి ప్రత్యక్షముకాగా వారికిని ఇచటి నుండియే మంగళాశాసనము చేసిరి.

మార్గము: మద్రాసునుండి 65 కి.మీ. దూరమున కలదు. సకల సదుపాయములు కలవు.

పా. పారాయదుణ్డు మిழ்న్ద పవళత్తూణై;
        ప్పడు కడలిలముదత్తై ప్పరివాయ్ కీణ్డ
   శీరానై; యెమ్మానై త్తొణ్డర్ తజ్గళ్;

                                      112