పుట:DivyaDesaPrakasika.djvu/194

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


91. తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము) 18

శ్లో. భాతి శ్రీ మణికర్ణికాఖ్య సరసి శ్రీ నీర్‌మలాఖ్యే పురే
   నీర్‌వణ్ణన్ విభురత్ర తోయగిరి రిత్యాఖ్యాం విమానం శ్రిత:|
   నాయక్యా త్వణిమామలర్ పదయుజా మాణిక్య శయ్యాంగతో
   లంకా పట్టణ వీక్షితాంచిత వపు స్తుండీర దేశప్రభు:||

   తొండమాన మహారాజ మార్కండేయ భృగూత్తమై:|
   ప్రత్యక్షిత: కలిధ్వంసి శ్రీ భూతముని కీర్తిత:||

వివ: నీర్‌వణ్ణన్-అణిమామలర్ మంగై తాయార్-మణికర్ణిక పుష్కరిణి-తోయగిరి విమానము-దక్షిణ ముఖము-మాణిక్యశయనము-తొండమాన్ చక్రవర్తికి, మార్కండేయ భృగుమహర్షులకు ప్రత్యక్షము-కలియన్, పూదత్తాళ్వార్ కీర్తించినది.

విశే: తిరునీర్‌మలై ఒక విలక్షణమైన దివ్యక్షేత్రము. వనములతోను, జలప్రవాహములతోను రమణీయమైనది. "నిన్ఱానిరున్దాన్ కిడన్దాన్ నడన్దా ఱ్కిడమ్‌ మామలైయానదు నీర్మలైయే" అని తిరుమజ్గై యాళ్వార్లు సాదించినట్లుగా ఇక్కడస్వామి నిలచున్న; కూర్చున్న, శయనించిన, నడచుచున్న రీతిని వేంచేసియున్నారు. "నఱైయూర్; తిరువాలి, కుడన్దై తడన్దిగళ్ కోవలర్ నగర్"(తి.మొ.2-4-1) అనునట్లు నఱైయూర్‌లో వేంచేసియున్నరీతిని నిలచుని, తిరువాలి తిరునగరిలో వలెకూర్చుని, తిరుక్కుడన్దైలో వలె శయనించి, తిరుక్కోవలూర్‌లో వలె నడచుచున్న రీతిని వేంచేసియున్నారు.

ఇచట కొండపై రంగనాథులు శయన తిరుక్కోలములో వేంచేసియుండగా (దక్షిణ ముఖము) కూర్చున్నసేవగా శాంత నరసింహస్వామి (తూర్పు ముఖము) నడచుచున్నరీతిలో ఉలగళన్దపెరుమాళ్(తూర్పు ముఖము) నిలచున్న సేవగా చక్రవర్తి తిరుమగన్ వేంచేసియున్నారు. కొండపై శ్రీరంగనాయకి సన్నిధి వేరుగా గలదు. కొండదిగువున నీర్‌వణ్ణన్ ఉత్సవమూర్తి వేంచేసియున్నారు. మణికర్ణిక, క్షీర, కారుణ్య, స్వర్ణ తీర్థములు గలవు. ఈక్షేత్రము చుట్టును నీరు నిలచి యుండెడిదట. తిరుమంగై ఆళ్వార్ ఇచటికి వేంచేసి జలపరివృతమైన సన్నిధిని చేరరాలేక ఆరు మాసములు ఇక్కడనే వేంచేసియున్నారట. అందుచే ఈక్షేత్రమునకు తిరుమజ్గై యాళ్వార్ పురం అను తిరునామము కూడ కలదు.

మార్గము: పల్లావరం స్టేషన్‌కు 4 కి.మీ.

                           110