Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

83. తిరుక్కారగమ్‌ (కాంచీ) 10

శ్లో. అక్కిరాయ సరోరమ్యే కారకాఖ్యాన పట్టణే|
   మద్మామణి రమానాథ:కమలాకర నాయక:||
   వామనం ప్రాప్య వైమానం దక్షిణాముఖ సంస్థిత:|
   కారకర్షి తపోలబ్ధ రాజతే కలిజిన్నుత:||

వివ: కరుణాకర పెరుమాళ్-పద్మామణి త్తాయార్-అక్రాయ పుష్కరిణి-వామన విమానము-దక్షిణ ముఖము-నిలచున్నసేవ- కారక మహర్షికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ సన్నిధి ప్రత్యేకముగా లేదు. ఉలగళన్ద పెరుమాళ్ సన్నిధిలో తాయార్ సన్నిధికి ఎదురుగా నున్నది.

పా. నీరగత్తాయ్ నెడువరైయి నుచ్చి మేలాయ్
          నిలాత్తిజ్గళ్ తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి
   ఊరగత్తాయ్, ఓణ్ తుఱైనీర్ వెஃకావుళ్ళాయ్
          ఉళ్ళువారుళ్ళత్తాయ్; ఉలగ మేత్తుం
   కారగత్తాయ్ కార్‌వానత్తుళ్ళాయ్ కళ్వా
          కామరుపూజ్కావిరియిన్ తెన్బాల్ మన్ను
   పేరగత్తాయ్, పేరాదెన్నె-- నుళ్ళాయ్
          పెరుమామన్ తిరువడియే పేణినేనే.
          తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్‌ 8


మంచిమాట

"మీకు వలదా!"

ఒకప్పుడు నంజీయర్ అను ఆచార్యులు అనారోగ్యముచే బాధపడుచుండిరి. వారికి ప్రాణాపాయము తప్పదని అందరు భావించుచుండిరి. ఆసమయమున "కుట్టక్కుడి యిళైయాళ్వార్" అనువారు వారి యొద్దకు వెళ్ళి ఈ సమయమున ఆత్మకు హితమైన ద్వయమంత్రమును అనుసంధానము చేయరాదా! అని పలికిరట. దానిని విని నంజీయర్ "మీరు అనుసంధానము చేసికొనరాధా! నాకేమికావలెను. ఇంకను ఈ లోకములో తిరిగే మీకు అవసరములేనిది మంచములో పడియున్న నాకు మాత్రమేనా కావలెను!" అని సమాధానమిచ్చిరట. కావున ఇహలోకయాత్ర చేయువారికిని పరమపదయాత్ర చేయువారికిని హితమైనది ద్వయమంత్రము మాత్రమే.

                                             102