49. తిరుక్కురుగూర్ 9 (ఆళ్వార్ తిరునగరి)
శ్లో. భాతి శ్రీ కురుకాపురే పురవరే శ్రీ తామ్రపర్ణీ నదీ
తీరస్థే సురదిజ్ముఖ స్థ్పితిరసౌ గోవింద వైమానగ:|
దేవ్యా సంతత మాదినాధలతయా యుక్త శ్శఠ ద్వేషిణాం
దృష్టాస్తత్త్యవ లోలుపో నవరతం దేవాధినాథ ప్రభు:||
వివ: ఆదినాథ పెరుమాళ్(పాలిందునిన్ఱ పిరాన్)-ఆదినాథ వల్లి-తామ్ర పర్ణీనది-గోవింద విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-నమ్మాళ్వార్లకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.
విశే: ఈక్షేత్రమునకు"ఉఱైకోయిల్"(సర్వేశ్వరుడు నిత్య నివాసము చేయుచున్న)దివ్యదేశము అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వార్లు ఈ స్వామి విషయములో పరత్వ సౌలభ్య గుణములను సేవించి ప్రకాశింపజేసిరి. (తిరువాయిమొழி 4-10)
ఈ దివ్యదేశమునకు 1.కి.మీ దూరములో నమ్మాళ్వార్ల అవతారస్థలమైన "అప్పన్ కోయిల్" అను గ్రామము కలదు. ఈ క్షేత్రమునకు సమీపముననే నవ తిరుపతులు గలవు. ఆళ్వారు తిరునగరి యను అష్టాక్షరీ మంత్రరూప పద్మమునకు యెనిమిది అక్షరములనెడి యెనిమిది పద్మదళములవలె యెనిమిది దివ్యదేశములు అమరియున్నవి. ఈక్షేత్ర సంగ్రహశ్లోకము
1. వైకుంఠ నాథ 2. విజయాసన 3. భూమిపాలన్
4. దేవేశ 5. సజ్కజి విలోచన 6. చోరనాట్యన్
7. నిక్షిప్తవిత్త 8. మకరాయత కర్ణపాశౌ
9. నాథం నమామి వకుళాభరణేన సార్థం.
వివ: 1.వైకుంఠం-శ్రీవైకుంఠం 2. విజయాసన-వరగుణమంగై 3. భూమిపాలాన్-తిరుప్పుళిజ్గుడి 4. దేవేశ-తొలవిల్లి మంగలం 5. పంకజ విలోచన-తొలవిల్లి మంగలం 6. చోరనాట్యన్-తిరుక్కుళందై 7. నిక్షిప్తవిత్త-తిరుక్కోళూరు 8. మకరాయతకర్ణపాశౌ-తెన్ తిరుప్పేర్ 9. నాథం-పొలిందు నిన్ఱపిరాన్-ఆళ్వార్ తిరునగరి. ఈ తిరునగరిలో నిర్ణిద్ర తింత్రిణి(నిద్రపోని చింతచెట్టు)కలదు. ఇది ఆదశేషుల యవతారమని పెద్దలు చెప్పుదురు. ఈ వృక్షము క్రిందినే నమ్మాళ్వార్లు యోగనిష్ఠలో వేంచేసియుండిరి. ఇచట జ్ఞానప్పిరాన్ అను వరాహ పెరుమాళ్ సన్నిధి కలదు. ఈ క్షేత్రము మణవాళ మహామునులచే నిర్వహింపబడినది. మేషం ఉత్తర తీర్థోత్సవము. వృషభం విశాఖ నమ్మాళ్వార్ల తిరునక్షత్రం. 5వ రోజు ఉత్సవమున నమ్మాళ్వార్ హంసవాహనముపై వేంచేయగా నవ తిరుపతుల పెరుమాళ్లు వేంచేయుట
62