Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47. తెన్ మధురై 7 (మధుర)

తిరుక్కూడల్

శ్లో. శ్రీమద్ధేమ సరోవరేణ కలితే చక్రాఖ్య తీర్థాంచితే
   శ్రీమత్యై మధురాపురే సురదీశా వక్త్రాసనాలంకృత:|
   దేవ్యా సుందర నాయకో వకుళయా త్వష్టాంగవైమాసగ:
   దృష్ట శ్శాసక భార్గవాది మునిభి ర్బక్తార్థ ముజ్జృంభతే||

శ్లో. భక్తిసార కలిఘ్నాభ్యాం విష్ణుచిత్త మహర్షిణా|
   నీళయాపి చ తత్పుత్ర్యా మంగళాశాసిత స్సదా||

వివ: కూడలழగర్-మధురవల్లి-వకుళవల్లి(మరకతవల్లి వరగుణవల్లి తాయార్)-హేమపుష్కరిణి-చక్రతీర్థము-అష్టాంగవిమానము-తూర్పుముఖము-కూర్చున్నసేవ-శౌనక భృగుమహర్షులకు, పెరియాళ్వార్లకు ప్రత్యక్షము. తిరుమழிశై ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: మధుర పాండ్య రాజసభలో విష్ణు పరత్వ నిర్ణయము గావించి విజయులైన పెరియాళ్వార్లకు గరుడ వాహనారూడులై స్వామి సాక్షాత్కరింపగా పెరియాళ్వార్లు పల్లాండు పాడిన ప్రదేశము. తిరుప్పల్లాండు అవతరించిన స్థలము. ఇచట గల అష్టాంగ విమానము చాలా పెద్దది. అందు శయన తిరుక్కోలముతో(పవళించిన) శ్రీరంగనాథులు-పై అంతస్థులో నిన్ఱ తిరుక్కోలముతో (నిలచున్న) సూర్యనారాయణులు వేంచేసియున్నారు. వృషభం అనూరాధ తీర్దోత్సవం-కుంభ మాసం మఖ శాత్తుకోమురైగా పది దినములు తెప్ప ఉత్సవం. ఈ సన్నిధికి మూడు ప్రాకారములు గలవు. రెండవ ప్రాకారములో నవగ్రహములు ప్రతిష్టింపబడినవి. మూడవ ప్రాకారములో తాయార్, ఆండాళ్, మణవాళమామునుల సన్నిధులు గలవు. సన్నిధిలో ప్రసాదము లభించును. సన్నిధి వద్ద రామానుజ కూటము కలదు.

మార్గము: మధుర ప్రసిద్ధ పట్టణమగుటచే తమిళనాడులోని అన్ని ప్రాంతముల నుండి బస్ సౌకర్యం కలదు. రైలు వసతియు కలదు. 20 కి.మీ దూరంలో తిరుమాలిరుంశోలై, 10 కి.మీ దూరములో తిరుమోగూర్ కలవు.

పా. కోழிయుమ్‌ కూడలుమ్‌ కోయిల్ కొణ్డ కోవలరేయొప్పర్; కున్ఱమన్న
   పాழிయుమ్‌ తోళుమోర్‌నాన్గుడై యర్‌పణ్డివర్ తమ్మైయుమ్‌ కణ్డిఱియోమ్‌;
   వాழிయరో వివర్ వణ్ణ మెణ్ణిల్ మాకడల్ పోన్ఱుళర్, కైయిల్ వెయ్య
   ఆழிయొన్ఱేన్దియోర్ శజ్గుపత్‌తి యచ్చో వొరు వరழగియవా!
                 తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 9-2-5

                                            59