పుట:DivyaDesaPrakasika.djvu/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


45. తిరుత్తణ్‌కాల్ 5(తిరుత్తంగాలూర్)

(శివకాశి 3 కి.మీ)

శ్లో. దివ్యే పాప వినాశ తీర్థ రుచిరే తణగాల్ పురే ప్రాజ్ముఖ:
   శ్రీమానప్పనితి ప్రియామనుభవన్ ఆనందనామ్నీం స్థిత:|
   దేవీభిస్తు దిశా సమానగణనాభిర్దేవ చన్ద్రాలయ:
   శ్రీమద్వల్లభదేవ సేవిత వపూ రేజే కలిఘ్నస్తుత:||

వివ: అప్పన్-తణ్‌గాలప్పన్-అన్ననాయకి, అనంతనాయకి;అమృతనాయకి, జాంబవతి యను నలుగురు తాయార్లు-పాప వినాశ తీర్థము-దేవ చంద్ర విమానము-తూర్పు ముఖము-నిలుచున్నసేవ-వల్లభదేవునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఉషా అనిరుద్దుల వివాహము జరిగిన ప్రదేశము. ఇచట జాంబవతీ తాయార్ నిన్న తిరుక్కోలమున వేంచేసియున్నారు. మరియు ఇచట గరుడాళ్వారు, సర్ప, అమృతకలశ, అంజలిహస్తులై వేంచేసి యుందురు. అన్ని వసతులు గలవు. రామానుజకూటము కలదు.

మార్గము: విరుదునగర్-తెన్ కాశి రైలుమార్గము. శివకాశి నుండి 5 కి.మీ. శ్రీవిల్లి పుత్తూర్ నుండి విరుదు నగర్ నుండి బస్ సౌకర్యం కలదు.

ఈ క్షేత్రమునకు 25 కి.మీ దూరంలో శ్రీవిల్లి పుత్తూరు కలదు.

పా. పేరానై కుఱుజ్గుడి యెమ్బెరుమానై, తిరుత్తణ్‌గా,
    లూరానై క్కరమ్బనూరుత్తమనై; ముత్తిలజ్గు
    కారార్ తిణ్‌కడలేழுమ్‌ మలై యేழிవ్వులగేழுణ్డుమ్‌.
    ఆరాదెన్ఱిరున్దానై క్కణ్డదు తెన్నరజ్గత్తే.
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 5-6-2


పరమ ప్రయోజనము

మంచిమాట

ఆచార్యులందరి అభిప్రాయము: ఆళ్వారుల హృదయము: చతుర్వేదముల తాత్పర్యము, సర్వశాస్త్రముల ఉద్దేశ్యము పరిశీలించి చూడగా ఆచార్య కైంకర్యమే పరమ ప్రయోజనము అని తెలియుచున్నది.----------"నంజీయర్"

ఆచార్య కైంకర్యము అనునది తనకు ఆకలి కలుగునపుడు భుజించుట వంటిది. భాగవతకైంకర్యము తల్లికి అన్నము పెట్టుట వంటిది. భగవత్కైంకర్యము అందరితోపాటు తాను అన్నము తినుట వంటిది.-------"వడుగ నంబి"

                     57