పుట:Delhi-Darbaru.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

హైదరాబాదు సంస్థానము.


సాలారుజంగంతటి వాఁడే విశ్వప్రయత్నములు చేసి కట్టకడపట విఫల మనోరధుఁడయి యుండుటం బట్టియు, అమలులోనున్న, షరత్తులను బట్టి బీరారునుండి దనకగులాభ మేమియు గన్పిం పకుండుటం "ఇట్టియు, మీర్ మహబూబ్ ఆలీఖానుఁడు నిష్ఫల మగు ప్రాతపోరాటములకు నిష్టము లేనివాఁ డై ఉన్న దున్నంత వఱకు దిట్టము చేసికొన ప్రయత్నించి లార్డుకర్జనుతో 1902 వ సంవత్సరమున సంధి చేసికొని బీరారు విషయమును ఒక విధముగఁ దీర్మానము చేసికొనెను.

బీరారునుగూర్చినసంధి (1902),*

[1]

ఈ సంధినలన బీరారుమండలము నైజాము ప్రభుత్వము లోనిదే యనుట స్థిరాంగీకారమునం దెను. కాని ఆమండలము శాశ్వతముగా నాంగ్లేయులకు కౌలునకీయఁ బడెను. గుత్త 25 లక్షల రూపాయలని నిర్లయింపఁబడెను. లెక్కలు వేయఁగా తేలిన బీరారుమండల క్షామనివారణార్థ మయిన ఋణము 76 లక్షులును హైదరాబాదు సంస్థానమండల నివారణార్థ మయిన ఋణము 185 లక్షులును 30 సంవత్సరములలోఁ ఈగుత్త పైకముతో దీర్పఁబడు సట్లేర్పఱుపఁబడెను. ఇందునకు ప్రతిసం

......................................................................................................

  1. * బీరారును మరలించుకొనవ లెనను నాశయు, బీరారు మరల్చకుండుట నైజామున కన్యాయము సేయుట యనుతలంపును హైదరాబాదు సం స్థానమున ఈ సం= ఎనాఁటికి నిగలవనుటకు లార్డుకర్జను హైదారాబాదునకు దర్శనమియ్యం వెళ్లినప్పుడతనికి బాక రారు జంగు వ్రాసిన ప్రకటిత పత్రమేసాక్షి