పుట:Delhi-Darbaru.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

శ్రీరాజ దంపతులు.


ఉష్ణ భూమియగు బొంబయినుండి నాభావములు కటిక చలి సీమ యగు ఖైబరు కనుమ ప్రాంతములకుఁ బరు నెత్తుచున్నవి... అచ్చటఁ జరిత్రయందుఁ బ్రసిద్ధమగు ఆలీమసీదు గలదు.అచ్చ టికిఁ జుట్టుముట్టు నధికారమువహించు ఖానులు దమ మందల లో నుండి యేరిన పొటేళ్ళను, మంచి తేనెను గానుకగఁ గొని నచ్చిరి. ఇట్టి యాటవికములును, స్వల్ప నాగరికతా సూచక ములును నగు ప్రదేశములకునుఁ గళా కౌశలమునకు ముకుర ములు పోలి ప్రాచీన వైభనమును నెల్లడించు శిధిలభవనముల కిరవు లై శోభిల్లు ఢిల్లీయాగ్రాలకును దారతమ్యముఁ బరిశీ లించిన నెంత మనోరంజకముగను నుండునో గనుఁడు.. అటనుండి, 'మేము గ్వాలియరుకును, కాశికిని దరలితిమి. లోకమున మరె చ్చటను సాధ్యముగాని సందర్భము లచ్చట మాకు సమకూ రెను. చిత్రవిచిత్రములగు రంగువస్త్రములు తొడుగుకొని ఐరోపాఖండము నందలి మధ్య కాలపు (క్రీ. శ|| 14, 15, 16 శతాబ్దములు) సైనికులను స్మరణకుఁ దెచ్చు పార్శ్వవర్తులు బారులు బారులుగఁ జుట్టినడువ విలువఁగల యంబారులచే 'నలకరింపఁబడిన ఏనుంగుల పై నెక్కించి మమ్మును బట్టణము లలోనికిఁ బిలుచుకొని పోయి.....క్రొత్త సంవత్సరము పుట్టు నప్పటికీ - మేము , మన సామ్రాజ్యమున "రెండవ సగరమయిన కలకత్తాయం దుంటిమి. తగినంత కాలము "లేదుగాని లేనిచో జాతి విషయమునను, సాంఘికాచార విషయములను,