అవతారిక
సకల పురాణజ్ఞు లయిన మాతండ్రిగారు, చిన్ననాఁడు నన్ను బ్రక్కను బరుండఁ బెట్టుకొని, చిత్రవిచిత్రములైన పురాణకథల నెన్నిటినో మెదటిలోని కెక్కించి, అయిదాఱువత్సరముల ప్రాయము వచ్చుసరికి అనేక కథలను నేను మరలఁ జెప్పఁ గలుగునట్లు చేసిరి. అక్షరజ్ఞానమమరిన వెనుక నావిన్న గాథలను స్వయముగాఁ జదువుకొని యానందింపవలెనను నభిరుచి జనించి చివర కాయభిరుచియే యింగిలీషు నెడఁ బ్రాలుమాలికయు, నుద్యోగ పదవియెడ నేహ్యబుద్ధియుఁ గలిగించి ఆంధ్రభారతికి నన్ను శాశ్వత సేవకునిగాను, ఉపాసకునిగాను జేసి వైచినది. ఆనాఁడు మాతండ్రిగారివలన విన్న కథాపరంపరలో లీలాశుక చరిత్ర మొక్కటియై యుండెను. ఆ కథాబీజ మాధారముగా నీచింతామణి యందలి యితివృత్తము కల్పింపఁబడినది. ఇతివృత్తమునుబట్టి యిది ప్రకరణమై ప్రథమాంధ్రప్రకరణకర్తృగౌరవము నాకు దక్కించినది.
నాల్గవకూర్పు.
మూడవకూర్పు ప్రతులుకూడ మూడునాలుగు మాసములలోనే యైపోయినవి. ఆంధ్ర దేశమున దీనిపేరన్ని మూలలు కంగున మ్రోఁగుచున్నది. పల్లెలలో ఁగూడ దీని ప్రదర్శనములు పరంపరగా జరుగుచున్నవి. పవిత్రమైన యీ నాటకముయొక్క ప్రథమ ప్రదర్శకులు బందరు రామమోహన నాటక సంఘమువారు. ఇప్పటి కేసంఘమువల్ల నైన నేమి - నాలుగువందల నలుబదియాఱు ప్రదర్శనములు నా లెక్క కు వచ్చినవి. వర్తకులుకొంద జీవ్యాప్తి చూచి, కడుపుకక్కు.. అతిగాండ్రకు గంజినీళ్ల కిచ్చి, మాచింతామణి పోలికలతో మాయ చింతామణులను గోకించి, పట్టపగటి దొంగతనముగ బాజారులం ద్రిప్పుచున్నారు! ఇప్పటి కీవిధముగ మాచింతామణికి నాలుగు పిల్ల చింతామణులు పుట్టినవి! మసిపూసి మారేడు నేరేడన్నను, సన్న ముముదుగులు నంతలోఁ జేలక మానవు కాని ఈ గుజిలీమోస మెఱుఁగనివా రిదియె యనుకొని వానిం గొని, తరువాతఁ దెల్లపోవుట తటస్థించుచున్నది !