పుట:Chennapurivelasa018957mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపురీవిలసము

కప్పలపోలిసెట్టి వీధీప్రకరణము-ద్వావింశము

 
మ.ప్రణుతింపందగి యొప్పునప్పురిని గప్పల్పోలి సెట్టప్పవీ
ధిని నాముత్తెపుపేట నాభియనబందీగ్రాహముల్చేసి కా
ర్కొను టాటోతులు జారులుం గలహాకారుల్లోను గాఁబట్టిమే
ల్గను కొత్వాలుది కొల్వుకూటమది సాక్షాద్దండనీతిస్థితి౯.1

చ.చలిగొనుచేమగోగవిసి శాకినిమున్గయు మెంతిచుక్క బ
చ్చలులును దోసమావి పనసల్చిటి కాకరపొట్ల బీరవం
గలు సొరగుమ్మడుల్కదలి కాయలుచిక్కుడుకాయలాదికూ
రలుమఱిమాంసముల్పలుదెఱంగులుపొల్పగుమారుకట్టునన్.2


బందీశాలా ప్రకరణము-త్రయోవింశము
పంచపాదిమత్తేభము

  ప్రకటాటోప భయంకరంబు వికటప్రాకారగుప్తంబు దీ
  ప్రకవాటంబు బహిర్విటంకతటలంబ ప్రాణహృత్పాశయం
  త్రకలాపంబు నివాతకూట పటలాంత్తసప్తబందీజన
  ఘకఠోరంబటు యొప్పునప్పురి జయల్ఖానాయుముత్యాలపే
  టకు దగ్భాగమున న్మహానరకవాటప్రోత్కటాభిలమై.1

మ.మలమూత్రక్తమలీమసాంగులు పరిమ్లానాన్యనిమ్నాక్షులా
   విలలోలప్రవికీర్ణ కేసభరులు ద్వేలాంత్రయంత్రయంత్రాభగా
  త్రులు జీర్యన్మలినాల్పకర్పట పరీతుల్గానబందీలు నా
  కులతంజెంది వసింతురందు నరకక్షభ్యజ్జనప్రక్ష్యత౯.2