పుట:Chennapurivelasa018957mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠమంబగు నంతరాళపద్ధతి.

63

కనీయంబు నోడకాలువీధియు నుత్సవావసర విమానకాయమానం వితాన విలంబమాన వివిధ కాంస్య పాత్రికా లంకృతంబు నత్యుచ్చంబునగు కచ్చాలేశ్వరుని గుడియు విమలసలిల పరిష్కరిణియగు పుష్కరిణియుం గలిగి యమరునరమనవారివీధియుఁ బెద్దపాళమ్మయనుగ్రామదేవత గుడియును గజవదన సదనంబునుం గుదురుకొన రమనీయంబగు నయ్యప్పసెట్టివీధియు సెంగళునీరు పిళ్ళారిగుడివీధియు హూణసందోహమందిర సుందరంబగు నైనియప్పని వీధియు దాదృశంబులగు శంభుదాసు శౌకిముత్తుమలయప్ప యప్పుమేస్త్రి డైమిన్సుజై మిన్సుల వీధులును సమస్త ప్రశస్త నిస్తులాస్తోకవస్తువిస్తాల శ్వేతకాయ వార్థుషికనికాయ వాణిజ్య సౌధమంటప విశాలంబ గు పాపమ్సువీధియుఁ నచ్చారప్పనివీధియు నాండియప్పమేస్త్రి వీధియు వెంకటాచల మొదలివీధియుం ద్యాగ రాయపిళ్ళవీధియు నిరిశప్పమేస్త్రియును త్తుంగతరాభంగ శృంగశృంగారమేదురాది కేశవహరిభవన మంగళంబగు ముంగమ్మవీధియు ముక్కుముత్యామెందులభయు షార్టు సుబ్బరాయమొదలి వీధియుఁ బెడగుంట్లవీధియు నూతభవనంబులచే దట్టంబై ధర్మరాయ దేవసదనంబునకుంబట్టగు మిట్టవీధియు మారుకట్టునుంగలిగి యుండునందు

కచ్చాలేశ్వరప్రకరణము-సప్రదశము

 
శా. కచ్చాలేశ్వరు నాలయాంతరమునంగన్పట్టుదీపచ్ఛటాం
   చచ్చారుచ్ఛవిఁగాయమానముల పంచ౯వ్రేలునచ్ఛాచ్ఛతో
   ద్యచ్చిత్ర ద్యుతిమించు కంచములసాంద్రచ్ఛాయజాజూనని
   ద్యుచ్చక్రాభగనందధీశ్వరుని చిజ్జ్యోతిర్మయత్వప్రధల్‌.1