పుట:Chennapurivelasa018957mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

చెన్నపురీ విలాసము

   ఠవలయు సౌధమండల విటంకములంగననైరి ఘూర్జరాం
   గనలు విమాన గానిషకాంతలు నాగుజరాతిచీధిలోన్.2

మందవెళివీధిప్రకరణము

చ. పనిగొనకుందలమూలనిడఁ బ్రాతపడున్ఫలమేమటంచు పె
   న్గనులధనంబు పెంపుగని నవ్యతమించఁగ బేరమూన్పనా
   ధనపతి పెక్కురూపములుదాల్చెను నాఁగవణిగ్జనాళిమే
   ల్వినుతివహించు మందవెళివీధినిరత్నమయాపణంబుల౯.1

ఉ. ఆపుటభదనంబునకుఁనాభరణస్ఫురణంబువూన్చుర
   త్నాపణ రాజిలబ్ధపణయత్న వినూత్న చిరత్నరత్నపా
   ళీపటురాసులుల్బణపు నీలఁదనర్చును వారిరాశియా
   త్మీపగరత్నలక్ష్మిపురి యొద్దను దాఁపగనుంచెనోయనన్.2

చ. విరివిఁదనర్చుమందవెళి వీధిసరాబులు నాపణంబులం
   బరచు ననర్ఘ్యరత్న రుచిభాస్వరభూషణపుంజముల్మనో
   హరనగరీ గృహేందిరలకర్థిపృధగ్గతిరత్నగర్భ భా
  సురముల నేడు వారముల సొమ్ములనీనెను నాసిరుల్గను౯.3

పెద్దయంగడివీధీప్రకరణము.త్రయోదశమము

మ. పుడమిన్వేడ్కలుచూడఁగోరినయెడల బొల్పారు నాపెద్ద యం
    గడివీధిం దగఁగన్గొనన్వలయ లోకఖ్యాతమవ్వీధి యే