పుట:Chennapurivelasa018957mbp.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

చెన్నపురీ విలాసము


మ. పసుపున్నూనియ నిగ్గులంగములపైఁబైఁబర్వతాంబులపుం
    బసపుక్కిళ్ళకునిక్క వన్నెగల వల్వల్గట్టిపూదండలిం
    పెసఁగంగొప్పులఁజంకబిందె చనుదోయిన్రాయఁదత్కూపవా
    రిసతుల్దెత్తురుగుంపులై నగరి దారింజూడ్కిలు న్వేద్కగా౯.2

శా.ఆకూపంబులబుట్టురేయుఁ బగలత్యాశ్చర్యసంమర్దమో
  ెహూకన్పట్టును వేయుచేఁదమఱితీయుంజేఁదయున్మున్నుము
  న్వీకంజేదగ బోవువారు మఱియున్నే ముందునేముందటం
  చాకారించెడివార లైజలము తీయస్సందడుల్సేయగ౯...

చ.పొలుపుగఁబుష్పకూపజలపూర్ణఘటంబులు దొంతిగాశిరం
  బుల ధరియించియయ్యరవ బోటులు వీటనుమేటివీటుకు
  ల్కులనరు దెంతురాత్మజితకుంభసమున్నతి కోర్వకాగ్రహుా
  చ్చలనముగాంచు భంగిబిగి చన్గవపయ్యదమిాఱినిక్కుఁగా౯.4

జంబురాతోఁట ప్రకరణము-అష్టమము


క. జంబూరాజియుతంబగు
   జంబూరాతోటలోఁ బసఁబరంగులునో
   జంబూరాయిడిఁబ్రరా
  జంబూరాడఁగనిల్పు సఖులనఁగదరే.


టంకశాలాప్రకరణము-నవమము


ఉ.ఆపురిటంకశాలవరణాగ్రవిటంక విశంకటాభిత
  స్ధ్యాపితకాచశంకుభయదంబుకఠోరక వాటదు
  ష్ఫ్రాపమనేక హూణభటవగ౯బహుప్రతిహారిగుప్తమా
  లోపలనొప్పుయంత్రగృహలోహహృహాయుధకూట కోశముల్>