ఈ పుట ఆమోదించబడ్డది
54
చెన్నపురీ విలాసము
యామ శ్రీవిలసిల్లుఁ దత్పురిఁ దదధ్యక్షుండు వావిళ్ళ స
ద్రామస్వామి వివశ్చిదగ్రణి ప్రసిద్ధ ప్రఖ్యగాంచుర్ధర౯.6
హూణదేవాలయ ప్రకరణము-ద్వితీయము
క. అభ్రంలిహశిఖరములు వి
శుభ్రసుధాలేపవిభవ సుభగములు మహా
విభ్రమములు పాదురులయ
దభ్రములగు గుడులు పర్వతభ్రమదంబుల్.1
చ.గములయియాదివారముల గాఢపు భక్తిమదిందలిర్పఁగాఁ
బ్రమదలతోడఁగూడి నిజభావముల న్సకలేశ్వరున్విభు౯
శమదమయయుక్తి ధ్యానములు సల్పుదురెప్పుడు నన్యకార్య వి
భ్రమ రహితాంతరంగులు పరంగులు పాదిరిగుళ్ళ నప్పురి౯.2
పోటోగ్రాఫీప్రకరణము-తృతీయము
<poem> శా. ఛాయాగ్రాహిణియాంజనేయుని తనుచ్ఛాయన్వడిన్నిల్పితా
డాయందీసెననంగవింటిమది చూడన్యంత్రపేటి౯ ఘన ప్రాయాదర్శనములందునీడలఁ బొటోగ్రాఫిక్రియన్నిల్వఁగా జేయంజాలిరి యింగిలీషులు పురిం జిత్రాతిచిత్రంబుగ౯.1
చ. నలువయొనర్చు స్వగ౯ము వినశ్వరమంతకు మున్నె యాశునా
శుకు ప్రతిబింబ వైఖరులఁజూడఁగఁదాదృశబింబలలీలల