పుట:Chennapurivelasa018957mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

చెన్నపురీ విలాసము

      
పంచచామరము.
   ఋజుమ్రదిష్ఠ సత్కరహృష్ట సప్రజోల్లస
   త్ప్రజాప్రజోజ్జ్వలధ్వసంతవాడ రాజ్యధూర్వహా
   ధ్వజస్ఫుర ద్గజాశ్వపూర్ణ ధాటికారి దుస్సహా
  భుజాభుజంగ రాజభోగభోగ భూసుఖావహా.

గద్యము.

ఇది శ్రీమన్మాల్య శైలనృసింహప్రసాద సమాసాదిత సకల శాస్త్ర

సంవిదుపస్క్పత సంస్కృతాంధ్ర సాహితీ పురస్కృత సరససార

స్వత చతురవాగ్ధోరణి మతుకుమల్లి కులమతల్లి కాబ్జవల్లికా

వియన్మణి కనకాద్రిశాస్త్రి బుధగ్రామణి తనూ భవాగ్రణి

నృసింహ విద్వన్మణిప్రణీతంబగు చెన్నపురీవిలాసంబను

ప్రబంధణ్బుబణ్దుఁ బంచమంబగు నుత్తరపద్ధతి

సంపూర్ణము.

శ్రీరస్తు.

శ్రీవేణుగోపాలస్సహాయః

షష్ఠమంబగు నంతరాళపద్ధతి ప్రారంభము

అందు ముద్రాక్షరశాలా ప్రకరణము. ప్రథమము.

 
క. శ్రీమద్వసంతవాడ
   గ్రామస్థిత వేంకటేశ్వరఖ్యాతహరి
   స్థేమపటుభక్తి నిర్మిత
   భూమశిలాధామనాగ భూపలలామా.