పుట:Chennapurivelasa018957mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంబుట్టి బెట్టెగఁదట్టి దట్టంపుమంటలు బెట్టిదంబుగ నెట్టుకొనంబట్టుయ్య చుట్టునుం దొట్టిలోనం బట్టిన నెగదొట్టు నుదకపూరంబుగ్రాఁగి తెకతకనుడికి మసలి వెసరుల వసంగ సరెత్తి దిగువాఱముసురుగొను నావిరి వావిరింగావిరి కొని తీవరంబువావికి న్వెంకనూల్కొలిపిన కుబ్జయంత్రస్తంభనాళద్వారంబులంబోవం దధుద్దామ దహన దాహాతిరేక సంతప్తసలిలసంక్షోభ సహకృత ధూమోద్గమనరభసభవ మహాబలరయవశంబున సుప్తోత్ధితంబు చందంబున జడం బయ్యుఁజేతనంబుపగిది మెల్లన నాదించుచుం గదలి బొదలి నీల్గినిక్కి సాగి జరిగి క్రమ విజృంభితంబైన గరసౌధ రుత్మతరత్న ప్రభాప్రతిఫలనంబునకు జడిసి కడలివెడలి వదనంబున విషానలార్చులు పేర్చి మిగులనూర్చుచు బుసకొట్టుచుంబఱచు మహాద్భుత భుజంగంబు భంగిఁ సేతుసురంగంబులు దూఱి వెడలుచు బడబానల స్ఫులిం గంబులమును కొని ఘూర్ణిళ్ళుచుఁ బశ్చిమా కూపారంబు జేరం బాఱుపూర్వసాగరా భంగ సముత్తుంగ తరంగి భంగికా పరంపరవడువున నిమ్నోన్నతాభోగభాగ విభాగంబు లెఱుంగనీక పుడమిం బర్వుచు జలధి జలంబులు మిగులఁ గ్రోలితత్సలిలాతి భారంబున నెగయంజాలక నేలపరుపుగఁ బరువెత్తు విద్యుల్లతా వలయితానన స్ఫీతంబు లగు జీమూతంబుల భాతి నతిగంభీర మధురంబుగ గర్జిల్లుచు నూర్జితంబుగ బవనజవంబున నానాటికిఁ ద్రింశ ద్యోజనాయామంబు పఱచి యెడనెడ నిలుప నిలుచుచు మరల మరద్రిప్పఁదత్క్రమంబునగ్రమ్మఱ నాపురం బుఁ జేరుచుండు మఱియును.8

గీ.రైలురోడ్డుల రేలఁగంబాలమిాఁద
  జిత్రవర్ణప్రదీపము ల్చెలువుగాంచు