పుట:Chennapurivelasa018957mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీరస్తు

శ్రీవేణుగోపాలస్సహాయః

ద్వితీయంబగు పూర్వపద్ధతి ప్రారంభము.

అందు సముద్రప్రకరణము ప్రథమము


క. పరిపూర్ణ ధాన్యధనభా
   స్వరతరగూడూరురాజ్య సామ్రాజ్యవిక
   స్వరవివిధ విభవజిత కి
   న్నరపతివాఃపతి మహేంద్ర నాగనరేంద్రా.1

వ. అవధరింపుము.2

ఉ. ఆపుటభేదనంబునకు నారయదూర్పున దీవ్రవాత వి
   క్షేపవిఘూర్ణితోర్మిచయజృంభిత భూరిగభీరఘోషణా
   టోపముతో బయోధినెగడుం దదశేషపురాధిరాజతా
   ధ్యౌపయికానిశధ్వనదయత్న భవాద్భుతదుందుభిస్థితిన్.3

ఉ. భ్రాంతివహించునొక్కపుడుఁబాయఁడు చెంతవిసించునానదీ
   కాంతుఁడు జాలిమైకొనఁగ గామిక్రియన్నగరీమతల్లీమే
   ల్గాంతికిఁజిక్కి చూపునధికంబుగ నూర్మిభుజాముఖోచ్ఛల
   ద్దంతురశీకరస్తబకదంభసముజ్జ్వల మౌక్తికాంజలుల్‌.4

ఉ. తుంగతగెల్వనింగికెగఁదొట్టిసముద్ధతిఁబొంగుసాగరా
   భంగతరగ భంగికలు ప్రాంతగ సౌధపదాంతఘట్టన౯
   భంగమునొంది లజ్జపడుభంగివిళీననములై జనున్సదా
   భంగుర వృత్తులౌజడులు వాంఛితలాభముల౯ భజింతురే..5

ఉ. శ్రీ మెఱయంగనంకమునఁ జెల్వగుతద్వరదుర్గలక్ష్మీన
   క్షామవిసర్పితాంబు పరిఘాభుజమందలిఁజేర్చి పుత్రికా