పుట:Chennapurivelasa018957mbp.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

చెన్నపురీ విలాసము


చ. పురివెలిపేటలందునుపఁబొల్పగు నారికెడంబుతోటలం
   దిరువగుబంగళాల కొకరికిద్దఱు మువ్వురు లంజయాండ్రతో
   వరశకటాప్తినేగి ధనవంతులు నాగరులెల్లరాత్రులం
   బరగ సుఖింతురెప్డు మధుపాన రతోవవిభ్రమోన్నతి౯...3

మ. పురికిందక్షిణపశ్చిమంబుల వనాభోగంబులుంజూడ గౌ
    ర్నరులుంగర్నలు సెక్రిటేరులు కమాన్డర్లింక జడ్జీల్కల
    క్టరులుం బాదారులుంగమీషరులు మేస్తిర్లెంజనిగ్లారిగా
    దొరలుండదగుబంగాళాలు చెలువొందున్నూరువేలుందగ౯..4

శాకతక్రవిక్రయికా ప్రకరణము-ఏకాదశము.

చ. తికముక పైటఁజాఱుచనుతిత్తులు గంతులు వ్రేయ సోర్ణగం
   డ్లకు సరితూట్ల వ్రేలుచెవుల౯ బెనుగమ్మలుతూఁగధూమప
   త్రకలుషవీటికాశన శితప్రచలాధరలై చరింతురిం
   చక వడిశాకవిక్రయికశూద్రజరద్ద్రవిడాంగనల్ పు౯...1

సీ. పడఁతి రోతగు చల్లపిడతకు వెలయెంత
              పెద్దదుడ్డటువైచి పేర్మిఁగొనుము
   తరుణి నీపెరుగుముంతలు పల్చనైనవి
              తోడుగూడినవవి చూడుమింక
   కలికిరొ పాలిండ్లఘనతఁజెల్వగుఁగదా
              పాలిండ్ల జూడ మాపటికిరమ్ము
  వనజాక్షి నీవెన్న వలపులూన్పవెప్రీతి
             స్నేహముగలచోట నెరయువలపు