పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

790

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


దైవాత్తు తారసపడక పోయే పక్షంలో యేడిద్ధుఁడో బిద్ధుఁడో లేకపోతే డబిద్ధుఁడో బూకరించేశక్తి వున్నవాఁడు యెత్తి తనవంటి బూకరింపువాళ్లకు యేపావో చవలమో చేతులోఁబెట్టి తక్కినవాళ్లకు మొండిచేయి నా పరుగు కడుచుకోమని చెప్పి “ఫలాయమానస్యకం దైవలాభః" చేయడం జరుగుతూ వుండేది. వీట్లవైఖరి ఆకళింపుకాని ఛందోమాత్ర పరిజ్ఞాతలుతప్ప ఆయీ పళ్యాలకు యేమాత్రం నామరూపాలు వున్నా ఆ తరగతివాళ్లు వెళ్లినట్లు లేదు. దారిద్ర్య దోషం చేత యీ పళ్యాలకు పిండిప్రోలు లక్ష్మణ కవిగారు వెళ్లేవారని చెప్పకోగా వినడం. ఆపెళ్లివారికీ కవిగారికీ జరిగినసంభాషణలు మా (తి. వెం.) చిన్నతనం నాఁటికి ముదిరిన ముసాలితనంలో వున్న పెద్దలు చెప్పకునేవారు. శిష్టు కృష్ణమూర్తి కవిగారూ లక్ష్మణకవిగారు సమకాలీనులే అయినా యెన్నఁడూ యీసంభావనకు “పరువుతక్కువ" గాభావించి వెళ్లేవారుకారుట! లక్ష్మణ కవిగారు సకాలానికి వెళ్లకపోయినా పట్టుపట్టి సంభావన వసూలు చేసేవారఁట! మా ముత్తాతగారున్నూ వెళ్లినట్లు లేదు. ఏనుఁగువారున్నూ డిటో, యికనల్లా దీనికి హాజరుకావడం పిండిప్రోలువారు మాత్రమే. వొకషావుకారు యింట వివాహం జరిగిన తరువాత సుమారు సంవత్సరం కాలం అతిక్రమించాక లక్ష్మణకవిగారు సంభావన తేతెమ్మని అడిగితే లిమిటేషన్ పాయింటు చూపి షావుకారు మొరాయించేటప్పటికి కవిగారు “మీ యింట జరిగిన వివాహంలోకి నేనురాలేదని నీవు బొంకుతూవున్నావు. నేనువచ్చేవున్నాను కాని పెళ్లిహడావుడిలో నీవు తబసీలువారీగా చూడలేదు. నాకబలిముగ్గు పెట్టడం జరిగిందంటావా? అనవా? అయితే ఆముగ్గుదేనితో? పిండితోనేకదా? యిక్కడికిసగం తేలింది. ప్రోలుతేలాలి –పంచరంగులతో ఆరోజున పెట్టేముగ్గుపేరు "ప్రోలు" శబ్దంచేత వాడడంకూడా తెలియదానీకు?” అని షావుకారుని డంగుపుచ్చి సంభావన వసూలుచేసినట్లు చెప్పకోగావినికి. యింకా యీలాటిగాథలే కొన్ని పెద్దల ముఖతః విన్నవికొన్ని వున్నాయి.

(1) కుళ్లముండా గుడ్డుతుక్కుంటాను బండముండా రాయిస్తావా?

(2) ప్రాసకోసం యేడిచానే కూసుముండా.

(3) ఇఁక పదివేలొసంగెద మఱిందుకు పద్యము చెప్పుసత్కవీ! (సమస్య).

(4) మాదిగవల్లి . రావేఁడినాయనా?.

(5) వీ-తీస్తేశ్వపతి, శ్వతీస్తే విపతి ఊరుకోవయ్యామామా.

(6) క. ఈశునకము కృష్ణమూర్తియే.

(7) మ. అవురా! శంకర! మంచివాఁడవు ... శంకర మంచివాఁడవు.

(8) చిట్టూరి కమలభవుని జేసె కమలభవుఁడు.