72
కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
మహమ్మదీయులు గోవధకుకూడా అట్టి సదుపాయంకావాలని ఆందోళనానికి మొదలు వేయడం వఱకున్నూ జరిగింది. బోర్డుప్రసిడెంటు ఆజమీందారులలోనే యెవరోవుండి యేలాగో ఆమాటతమకు దక్కవలసివస్తుందేమోనని చాలా భయపడడంవలకున్నూ మాత్రం నేనెఱుంగుదును. తరవాత యేంజరిగిందో నాకు తెలియదు. నిన్న మొన్నలాహోరుసిటీలోనే కాంబోలును యీ పుణ్యకార్యానికి శంకుస్థాపన గవర్నమెంటువారే చేసి గృహనిర్మాణం జరిగిసూ వుండంగా ఆ ప్రాంతపు హిందువులు మొట్టోమొట్టో అని లబలబలాడి ఆందోళనచేసి విన్నపాలు పంపుకోCగా ప్రజాద్వేషానికిది కారణమవుతుంది కాంబోలు ననియెంచో, లేకవీళ్లమతానికి వ్యతిరేకమయిన కార్యంవీళ్లదేశంలోనే చేయడమెందుకనో అంతటితో ఆcపినారని యేదో పత్రికలలో చదివినట్టు జ్ఞాపకం. యీ విధంగా జరుగుతూవున్న నిర్మాణాన్ని ఆంపడంవల్ల వచ్చిన నష్టమే 50 లక్షల రూపాయిరాలనికూడా ఆపత్రికే వ్రాసింది. నిజంగా అది సంపూర్తికావలసివస్తే లక్షలతో తేలేదికాక కోట్లతో తేలేదని నేననుకున్నాను.
•(၅ ಭೌಗಮಿ।ು లీపాటికాక సురేంద్రుండు పదత్రయం బడుగనీయల్పమ్మ నీ నేర్చునే?”
అన్నట్టుసూర్యోదయ సూర్యాస్తమయాలే యెరుంగని మహాసామ్రాజ్యానికి యెంత సొమ్మైతే మాత్రం లక్ష్యమేమిటి? మాంసభక్షణ చేయడం లేదని పూర్వపురాజుల ప్రభుత్వాన్ని గూర్చి చెప్పడానికయితే ఆధారాలు లేవుగాని యీలాటివిషయాల కీలాటి సదుపాయాలని యింతింత ద్రవ్యం వెచ్చించి కల్పించినట్టు దృష్టాంతాలేవిన్నీ లేవు. దిక్కుమాలిన ప్రారబ్ధం బ్రాహ్మణముండా కొడుకులు గట్టిగా నోరారా యేడవడానిక్కూడా వీలులేకుండా యెక్కడో వకటో రెండో వాక్యాలు అతిథిపూజకు లేcగదూడను కోసిపెట్ట వలసిందని వుండడంవకటిన్నీ గోమేధంఅంటూ వకటిన్నీ వచ్చి అడ్డు తగులుతూవున్నాయి. దీన్ని బట్టి మురారి మహాకవి- o
“మేధ్యావత్సతరీ విహస్య వటుభిస్సోల్లుంఠ మాలభ్యతే." -
అంటూ వ్రాశాcడు కూడాను. నరమేధప్రయుక్తమంత్రాలే కనపడతాయిగాని జరిగినట్టులేదు. హరిశ్చంద్రుడు చేస్తూండంగా విశ్వామిత్రుడు ఆంపచేసినట్టే పురాణగాథ చెపుతూవుంది. వేదమున్నూ దీనికివ్యతిరేకించదు. యింకోచోట తన పుత్రుణ్ణివోకణ్ణి చంపి యాగంచేస్తే నూరుగురు కొడుకులుకలుగుతారని పురోహితుండు చెప్పినట్టున్నూ వొకరాజు ఆలాటి యాగాన్ని చేసినట్టున్నూ భారతంలో కనపడుతుంది. అది నరమేధం అనిపించు కుంటుందో? లేదో నిర్ణయించతగ్గశక్తి నాకు లేదుగాని ఆ వుపాయం జెప్పిన పురోహితుcడికి సంపూర్ణ ప్రాయశ్చిత్తం పరలోకంలో జరిగినట్టు కూడా ఆ భారతంలోనేవుంది. అయితే