పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

చాటుపద్యమణిమంజరి

ముద్దుగా నేడ్చెను;—బట్టుమూర్తి బావు రని యేడ్చెను;—భట్టుమూర్తికిని రామలింగనికిని ఘోరవైరము. ఆబట్టుకవితను గూర్చి రామలింగకవి యి ట్లధిక్షేపించెను.

క. చీఁపర పాఁపరతీఁగలఁ
    జేఁపలబు ట్టల్లినట్టు చెప్పెడు నీయీ
    కాఁపుఁగవిత్వపుఁగూఁతలు
    బాఁపనకవివరునిచెవికిఁ బ్రమదం బిడునే!
శా. అద్రిస్నిగ్ధతలంబు బుద్బుదము లుద్యద్దారుభూషావళుల్
    క్షుద్రౌదుంబరపాకపక్వఫలముల్ శుక్త్యంతరాకాశముల్
    రుద్రాక్షాక్షరపంక్తివిభ్రమము లీరూఢి న్నిరూపింప నీ
    శూద్రప్రజ్ఞలు విప్రసత్కవివచస్స్ఫూర్తి న్విడం బించునే!
క. కెంగేల రామకృష్ణుని
    బంగరుకడియంబు లుండఁ బండితుఁ డగునా
    జంగులు జల్లులు గల్గిన
    సింగారపుటూరఁగుక్క సింగంబగునా!

కవీశ్వరులస్తోత్రపాఠములకు నతిశయోక్తులకును నేవగొని తిరుమలరాయ లొకనాఁడు స్వభావోక్తిమధురముగానే తన్ను వర్ణింపుఁడని వారి కాజ్ఞాపించెనఁట! ఆతని కొంటికంటిగ్రుడ్డి కలదు. రామలింగకవి వర్ణించిన వర్ణనము—

క. అన్నాతిఁ గూడ హరుఁడగు
    నన్నాతిని గూడకున్న నసురగురుండౌ
    నన్నా! తిరుమలరాయఁడు
    కన్నొక్కటి లేదు గాని కంతుఁడుగాఁడే.