పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

69

   ఆయురారోగ్య మస్తు తే హర్షితాఖి
   లావనీవర! సత్సమూహాంతరంగ
   పంకరుహషండ భాస్వత్ప్రభాతిసాంద్ర!
   వైభవసురేంద్ర! కుడుములవాసయేంద్ర!

కోటకోటీశమను నతనిపైఁ జెప్పినది.

సీ. ప్రజలచేఁ గానుకావళినిఁ గాంచునతండు
            హెచ్చుగా దీనుల కిచ్చు నితఁడు
   విషమదృష్టినిఁ గొంత వీక్షించు నాతండు
            సొంపుగా సమదృష్టిఁ జూచు నితఁడు
   ఇల్లిల్లు తప్పక యెలమినేఁగు నతండు
            వన్నెమీరెడు భాగ్యవంతుఁ డితఁడు
   కట్టుపుట్టము లేక కట్టుఁజర్మ మతండు
            కనకాంబరావళుల్ గట్టు నితఁడు
   శూలి యాతఁడు సద్గుణశాలి యితఁడు
   జ్ఞాని యాతఁడు పరమసుజ్ఞాని యితఁడు
   భర్గుఁ డాతఁడు నుతగుణవర్గుఁ డితఁడు
   యీశుఁ డాతండు కోటకోటీశుఁ డితఁడు.

తురగా వెంకంరాజు

ప్రౌఢకవితాధురీణుఁడయిన యీకవి యొకనాఁడు తాళ్ళూరనుగ్రామమునకుఁ బోయెనఁట. ఆరోజుననే యొకకమ్మయింటిలో వివాహము జరుగుచుండెనఁట. ఈకవి ననుబహుమానిం