పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

జేరని చాటువు లెన్నియో యింకను మేఘముల మఱుఁగున నున్న తారకలవలె నందందునున్నవి.

ఈవిషయము నెఱింగి బ్ర. దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు ఈ చాటుగ్రంథసంపాదకులలో రెండవవారుగా బయలువెడలిరి. వీరి ప్రయత్నము సకలాంధ్రజనశ్లాఘ్యము. వీరు వయస్సునఁ బిన్నలయ్యును, తమకుఁ గల భాషాప్రవేశాభిమానములు చెలులై తోడునడువ, వ్యయప్రయాసముల కోర్చి దేశసంచరణ మొనర్చి— మణిమంజరిలోఁ జేరని చాటువు లించుమించుగ నాఱువందలను గూర్చి యీ 'రత్నాకరము 'ను వెలువరించి మన కందఱకు నానందము గలిగించిరి. ఇందులకు మన కృతజ్ఞతను దెల్పుటతో దనివినందక, యింక నిటువంటిగ్రంథములను సంపాదింప మనశాస్త్రిగారికిఁ బ్రోత్సాహ మొసంగి వారి యుద్యమమునకు దోడుపడుట యాంధ్రులమగు మన కెల్ల రకును గర్తవ్య మని విన్నవించుచున్నాను.

9-7-17,ఇట్లు: కవిజనవిధేయుడు,

తోటపల్లిగూడూరు, నెల్లూరుపొణకా పెంచెలురెడ్డి