పుట:Chakkatladanda.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  


సీ॥ మోట నాల్గింగిలీష్ ముక్కలు నేర్పి ఫూల్ | గూస్ నాన్సెన్సయూగో వెయను ను
అలతి యైదారూళ్ళు కమలు దారీచేసి | ఖబరుదార్ బాత్ న కొకాన పడకడను
మొద్దొక పల్లెకు మున్సఫీ సేయుచు | గాడ్డెకొడుక పన్ను కట్టుమనును
చండి యొక్క ముఠాకు సముతుదారాయెనా | కొంటెబడవరయితుగొట్టుమనును

గీ॥ చదువు చదివిన హోదాలు చక్కబడిన| నోటిపట్టము గలవారికేటిపాటి
అని పలుకు . . . . . 91

సీ॥ ముషిణికాయనుగాకి ముట్టకుండగగుడ్డ |కట్టకట్టిననేమి కలుగునందు
పిల్లకాకిని గూటబెట్టియోరెము బెట్టి | యక్కక్కయననేమి యబ్బునందు
పొట్టేలునకు-వాగె బెట్టిగట్టిగ బట్టి | కడను నేర్పిననేమి యొదవునందు
పడుపుబానిస తొత్తు మెడను బంగరు తాలి | బొట్టు బెట్టిన నేమి పొసగునందు

గీ॥ తగనివారల నొక మంచి దారిబెట్ట |గలుగు కర్జంబోకింతైన గానరాదు
అని పలుకు . . . . . 92

సీ॥ వ్రాతకరణ మెప్డు వ్రాయుచుగూర్చుండ | మేతకర్ణముదిన రైతు సొమ్ము
మంతరాల్పెప్పుచు మల్లుబొట్లుండగ | నేగాని దిగమ్రింగు నెల్లుబొట్లు
కూచమ్మకుండలో గూర్పిబెట్టుచునుండ |మాచమ్మతాజేరి మాయజేయు
కంపునోరగుమామ గడియించుచుండగా| మంచినోరల్లుడు మట్టపరచు

గీ॥ పాటుపడువారలోక్కరప్పాటువలన | కడుపునిండించుకోన చుండ్రు కడమవారు
అని పలుకు . . . . . 93

సీ॥ తాడి క్రిందను బాలు ద్రావినప్పటికేని ! కల్లు, ద్రావినవానిగా దలంత్రు
వలికి లోసున్నంపు బట్టి బెట్టిననేమి | పీనుంగు కాడుగా బేరుకొండ్రు
మరుగుదొడ్డికి జాటుమాటాడబోయిన |రెండు వ్రేళ్ళకు నయియుండు నండ్రు
సానియింటికి సందెజాము పోచిళ్ళకు| బోయిన దగులాట మాయెనండ్రు

గీ॥ కానిచోట సలుపు మంచి కర్జమేని | కాని పనిగా దలంపక మానరెందు
అని పలుకు . . . . . 94

సీ॥ అలిగెజాండరు చాల బలిమి వాడంటిమా | గుజిని మామూదెంత గొప్పవాడు
గుజిని మామూ దెంత గొప్ప వాడంటిమా| ఔరంగజీబెంత పేరివాడు
ఔరంగజేబెంత పేరివాడంటిమా | ఫ్రాంసు బుస్సీ యెంతపని యొనర్బె
ఫ్రాంసుబుస్సీ యెంతపనివాడంటిమా | యింగిరీజలను క్లయివెంతవాడు

గీ॥ కలిమిగలవారు పెక్కండ్రుకలరుపుడమి |నొకరనిన వారికంటె మరొకరుగలరు
అని పలుకు . . . . . 95