పుట:CNR Satakam PDF File.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సి.నా.రె.శతకం

1. తే|| ప్రధితమైన ప్రజోత్పత్తి వత్సరాన
సరిగ గురుపూర్ణిమ తిథిని జననమంది
సింగిరెడ్డి వంశపు యశశ్శ్రీలు మెఱయ
కావ్యజాలము లల్లితే ఘనసినారె!

2. తే|| గరిమగన్నట్టి నల్లరేగళ్లు దున్ని
నీదు తండ్రి మల్లారెడ్డి మీదుకెక్కె
తల్లి బుచ్చమ్మ మమతల వెల్లికాగ
విదితరీతిని పెరిగితే వినుసినారె!

3. తే|| హరికథాగానరీతుల నాలకించి
ఛందముల పట్ల మక్కువ సాగుచుండ
సీసపద్యంపురచనలు సేసినట్టి
వినుతి గన్న ప్రతిభ నీది వినుసినారె!

4. తే|| తుమ్మకాయల జాడ బాల్యమ్ము జూప
మోటబావుల బుడబుడ మునుగు కతలు
మండుటిసుకలో నిల్చుండి మంటలేక
తిరిగినట్టి స్మృతులు తెల్పితే సినారె!