పుట:CNR Satakam PDF File.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రస్తావన

సి.నా.రె. ఆధునిక తెలుగు కవితా ప్రపంచం లో ఒక మేరుపర్వతం. ఆయన నిరంతర కవితా స్రవంతి. ఆయన భావాలు నవనవోన్మేషాలు. ఆయన కవిత్వం పరిమళ ప్రవాహం . సి.నా.రె. సిద్ధాంత గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు నేను ఎం.ఏ. తెలుగు చదివే రోజుల్లో నాకు నిత్యపారాయణ గ్రంథం . గురువర్యులు ఆచార్య ఎస్‌. గంగప్ప గారు ఆధునిక కవిత్వాన్ని గూర్చి చెప్పేటప్పుడు సి.నా.రెను గూర్చి, వారి సిద్ధాంత గ్రంథ రచనా వైశిష్ట్యాన్ని గూర్చి పలు పర్యాయాలు ప్ర స్తావించేవారు. సి.నా.రె. గ్రంథ పఠనం వల్ల, కాదు పారాయణం వల్ల నాకు వ్యాకరణంలో కంటే ఆధునిక సాహిత్యంలో అత్యధిక మార్కులు వచ్చాయి. దానితో సి.నా.రె. మీద మరింత అభిమానం పెరిగింది. వారిని చూడలనే కోరిక ఉండేది. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివే రోజుల్లో సి.నా.రె.ను మా తెలుగు శాఖకు తీసుకువచ్చే ప్రయత్నాలు ఆచార్య గంగప్ప గారు చేశారు గాని ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.

సి.నా.రె. రష్యా పర్యటన ముగించుకొని వచ్చినప్పుడు గుంటూరులో విశాలాంధ్ర పుస్తకాలయం మేడమీద ఒక సభను ఏర్పాటుచేశారు. సి.నా.రెను చూశానన్న సంతోషం అప్పుడు కలిగింది. ఆయన ప్రసంగించిన తీరు అద్భుతం. రష్యాలో కవులకిచ్చే గౌరవాన్ని గూర్చి వారు ప్రసంగించిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. వీధులకు, ఆయా ప్రత్యేక కూడళ్లకు కవులపేర్లు పెట్టి గౌరవించే సంప్రదాయం అక్కడ ఉన్నదని వారు చెప్పిన మాటలు నా మనసులో ముద్రితమయ్యాయి. వారి రూపం , మాట్లాడిన తీరు, ప్రసంగానంతరం, ఆయన సదస్యులతో జరిపిన ముచ్చట మరువలేనివి. అప్పటి నుంచి సి.నా.రె. పట్ల ఒక ఆరాధ్య భావం. పత్రికల్లో నిరంతరం వారు రచించే కవితలు చదువుతూ ఉండేవాడిని.

నేను సెల్‌ ఫోను శతకం రచించినప్పుడు ఆత్మీయ మిత్రులు డా|| ద్వానాశాస్త్రి గారు ఏమయ్యా ! సెల్‌ ఫోను మీదా వంద పద్యాలు రాశావా? ఈ విషయం మీద ఇంతవరకూ ఎవరూ కవితలు రాయలేదు. నీ శతకాన్ని సి.నా.రె. గారిచేత ఆవిష్కరింప చేస్తాను. అని నాలుగు ప్రోత్సాహపు మాటలు చెప్పి హైదరాబాదు