రం 6] బిల్వమంగళ 81
ప్రాణంబు పోవునను ♦ భయముచే నదిని
క్రోడము చేర్పించె ♦ కుళ్ళిన శవము!
హేయమగు వస్తువని ♦ ఎంచమే దాని?
పునుగు జవ్వాజియు ♦ పుత్తడి నగలు,
విలువైన వసనంబు ♦ వెలలేని హొయలు,
ఈరేడుజగముల ♦ నీసడింపగజాలు
నిట్టి తనులత కూడ ♦ నట్టిదే నమ్ము.
బొందిలో ప్రాణంబు ♦ పోయిన వెన్క
వెడలును దుర్గంధ ♦ వీచికలె దీన,
నిది నాశరహితమని ♦ యెంచితివే మొ?
సారహీనంబు సం ♦ సారమని యెరుగు,
హీనతర సారంబు ♦ నీతనువు! రోత!
కన్నులు మెరుగును ♦ గని భ్రమియింపగ
వెర్రివై వర్తకుని ♦ వేడితివి భార్యన్.
నీదు రత్నంబులే ♦ నిన్ను వంచించె
ఇవి లేకయుండిన ♦ నింత వచ్చేనా?
కోలువోయిన నివి ♦ కొంత శ్రేయంబు
కొరగామి పోయిన ♦ కొరత యుండదుగా?
నిస్సార మెప్పుడే ♦ న్నిత్యధన మగునా?
ఈహ వీడుమ యిట్టి ♦ మోహజాలమున.
(ప్రకా) తరుణీమణీ, నీ సిగపువ్వు నిట్లిమ్ము. (ఆమె యిచ్చును) నాయాజ్ఞ నీ కవిలంఘ్యమని నీభర్త నీతో