పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 బిల్వమంగళ [అం 3

              (ప్రకా) వింటిని రమ్ముము ♦ క్కంటి కెనయౌదు,
                               వీరీతి నన్నుప ♦ రీక్షచేయుదువె?
                       కొమ్ము నాకాంత నీ ♦ కోర్కె తీరంగ
                               నీకాంతగా రేయి ♦ నిండు తమకమున.
             బిల్వ - కంటివా చిత్తమా ♦ కన్నెంత గడుసొ,
                               ఏమి చేయగనెంచి ♦ తేమి నీవెర్రి?

ఆరో రంగము

(అహల్య-దాసి)

అహ - ఇంకోసారి పోయి అతనిని మంచిమాటలతో సమాధానపరిచి తీసుకొని రా. అతని కేదికావలెనంటే అదే భుజించనీ.

దాసి - నేను వెళ్లనమ్మా, బెల్లముకొట్టిన రాయి లాగ ఉలుకడు పలుకడు.

అహ - చీకటి పడేలాగుంది-ఒక్కసారి పోయిరా; ఆత డింతవరకు రాలేదనీ భుజించలేదనీ అయ్యగారికి తెలిస్తే, నామొగ మింక చూడరు-వారు వచ్చువేళ కావచ్చింది. పో, పో.

దాసి - మొగముముడుచుకొని మొద్దులాగ కూర్చున్నాడని మనము చెప్పలేమా? ఆ నిర్భాగ్యు డెక్కడా కనబడడు; పెద్దయింటిపడుచు పుక్కెడు నీరైనా తాగలేదని ఎరుగడా? అసలే పిచ్చిముండాకొడుకు! బిందెడు నీళ్లు నెత్తిమీద పోస్తే మెదడు చల్లబడి మతికుదిరి అప్పుడు తింటాడేమో?