పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 5] బిళ్వమంగళ 71

పోతూన్నదా? ఇక నేనెవ్వరిని కాచుకొని యుందును? నేను కూడా వారివెంటనే పోతాను. (తాళముచెవులు పారవైచి) ఇంత కూటికున్న పోలీసువారు నన్నేమిచేయుదురో? ఇప్పుడేమి చేయగల్గినారు! నా నుదుటిరాత ఎట్లుంటే అట్లు జరుగుతుంది. వీరు దేశాటనము చేస్తారు. హరిభజనమే వారి కుభయతారకము. లోభము నెవ్వ డాపుకొనగలడు? జగదంబ దుర్గయే దిక్కు ! ఈచింతామణి మృత్యువు నోటినుండి బైట పడింది కదా? నే నీపోలీసువారినుండి తప్పించుకో లేనా?.. (పోవును)

_______

ఐదో రంగము

_______

(వర్తకుని ద్వారముచెంత బిల్వమంగళుడు)

వర్త - అయ్యా, మీరెవరు?

బిల్వ - నేను బాటసారిని, నిలువ నీడ అడుగ వచ్చినాను.

వర్త - మీకీదశ పట్టిందేమి? మీవాసస్థల మేది?

బిల్వ - ఎక్కడుంటే అదే నాయిల్లు.

వర్త - గృహస్థాశ్రమము విడిచినారా?

బిల్వ - లేదు.

వర్త - నేడు నా ఆతిథ్యము స్వీకరింతురా?

బిల్వ - అందుకే ఇటు వచ్చినాను.