పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 4] బిళ్వమంగళ 69

వెంటవచ్చిన సాధువుతో నీదాసి నీకు పిచ్చిపట్టిందని చెప్పింది, వారిద్దరూ దుస్తంత్రము పన్నినారు; నేడు పాలలోకలిపి నీకు విషము పెట్టడానికీ, ప్రాణాలు పోగానే పాతిపెట్టడానికీ నిశ్చయించుకొన్నారు.

చింతా - విషమా! ఆమూలమూ తెలిసింది. దాసిమాట తలుచుకొంటే దడ పుట్టుతూన్నది -

                     పాడుచిత్తమ నీవు ♦ పరికించి చూడు
                                ఈధనము రూపు ని ♦న్నెంతకు తెచ్చె!
                     ఇల్లు జాతియు చేసె ♦ నింత ద్రోహంబు.
                     పిచ్చి - అవి కావు హేతువు ♦ లట్లనబోకు
                                లోభనీయము ధనము ♦ లోకంబులోన
                     చెట్టుక్రింద వసింతు ♦ శ్రీహరినేని
                                కోరనేదియు; కడలి ♦ కూతు రొకనాడు
                     ముద్దులుగా రా నా ♦ వద్దకు రాగ
                                పోవమ్మ వేగమే ♦ పొమ్మంచు నామె
                     పోనాడితిని మించు ♦ బోడిరో రమ్ము
                                ఇంటిలో నుండక ♦ జంట పోవుదము.
           చింత - విషమయము సంసృతి ♦ వెగటు పుట్టించు
                                విడువజాలనిప్రాణి ♦ వెంగలియె కాడె
                     మందేహతో దాని ♦ నిందనుక వలచి
                                మత్తుచెందెను కాని ♦ చిత్త మీనాడు
                     మెలకువజెందె నో ♦ మెలత బోధింప,